Kumbhabhishekam: కుంభాభిషేకంలో వెల్లివిరిసిన మతసామరస్యం

ABN , First Publish Date - 2022-09-10T16:34:01+05:30 IST

తిరువారూర్‌ జిల్లా కూతానల్లూర్‌లో మతసామరస్యానికి అద్దం పడుతూ మహాకాళియమ్మన్‌ ఆలయ కుంభాభిషేకం(Kumbhabhishekam)లో శుక్రవారం

Kumbhabhishekam: కుంభాభిషేకంలో వెల్లివిరిసిన మతసామరస్యం

ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 9: తిరువారూర్‌ జిల్లా కూతానల్లూర్‌లో మతసామరస్యానికి అద్దం పడుతూ మహాకాళియమ్మన్‌ ఆలయ కుంభాభిషేకం(Kumbhabhishekam)లో శుక్రవారం ముస్లింలు పాల్గొన్నారు. కూతానల్లూర్‌ శివాలయం వీధిలోని మహాకాళియమ్మ ఆలయానికి 12 ఏళ్ల అనంతరం కుంభాభిషేకం జరపాలని నిర్ణయించారు. ఆ మేరకు ఆలయ ప్రాంగణంలో శివాచార్యులు విఘ్నేశ్వర పూజతో యాగశాల పూజలు పారరంభించారు. శుక్రవారం ఉదయం పూర్ణాహుతి అనంతరం యాగశాల(Yagashala) మండపం నుంచి పవిత్రజల కలశాలను ఆలయ మాడవీధుల్లో ఊరేగించిన అనంతరం గోపుర కలశాలపై ప్రోక్షించి శాస్త్రోక్తంగా కుంభాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకల్లో కూతానల్లూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఫాతిమా బషీరా, కౌన్సిలర్‌ పర్విన్‌ సహా స్థానిక ముస్లింలు కూడా పాల్గొని మతసామరస్యాన్ని చాటారు.




Updated Date - 2022-09-10T16:34:01+05:30 IST