కష్టాలు పోవడానికి పూజ చేస్తానని చెప్పి.. యువతిపై అత్యాచారం చేసిన పూజారి.. ఎక్కడంటే?

ABN , First Publish Date - 2022-05-25T09:48:21+05:30 IST

జీవితంలో కష్టాలు పోగొట్టుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు పూజలు, శాంతులు చేసి కష్టాల నుంచి గట్టెక్కాలని అనుకుంటారు. అలా అనుకోవడమే ఒక యువతి పాలిట శాపమైంది. పూజలు చేస్తానని చెప్పిన పూజారి.. ఆమెను బలాత్కరించి, తన అకృత్యాన్ని వీడియో తీసి బ్లాక్‌మెయిల్...

కష్టాలు పోవడానికి పూజ చేస్తానని చెప్పి.. యువతిపై అత్యాచారం చేసిన పూజారి.. ఎక్కడంటే?

జీవితంలో కష్టాలు పోగొట్టుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు పూజలు, శాంతులు చేసి కష్టాల నుంచి గట్టెక్కాలని అనుకుంటారు. అలా అనుకోవడమే ఒక యువతి పాలిట శాపమైంది. పూజలు చేస్తానని చెప్పిన పూజారి.. ఆమెను బలాత్కరించి, తన అకృత్యాన్ని వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఈ ఘటన హరియాణాలోని హిసార్‌ జిల్లాలో వెలుగు చూసింది. 


సదరు పూజారి పేరు నరేష్. హిసార్‌లోని ఆజాద్‌ నగర్‌లో స్థలం కొన్న నరేష్.. అక్కడ ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆజాద్ నగర్ వచ్చినప్పుడు బాధితురాలి ఇంటికి వచ్చేశాడు. ఆ కుటుంబంలో భర్త సీఆర్‌పీఎఫ్ జవానుగా వేరే రాష్ట్రంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తల్లీకూతుళ్లను దగ్గరలోని ఆలయానికి తీసుకెళ్లిన అతను.. వారి జీవితాల్లో కొన్ని కష్టాలు ఉన్నాయని, అవి తొలగిపోవాలంటే పూజలు చేయాలని చెప్పాడు. ఈ కారణంతో ఆ ఇంటికి తరచూ వస్తూ.. యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 


తను చేసిన పాడుపనిని వీడియో తీసి ఆమెను బ్లాక్‌మెయిల్ చేశాడు. అలాగే పూజల పేర్లు చెప్పి రూ.1.15 లక్షలు కాజేశాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. అలాగే కొన్ని నగలు కూడా తీసుకున్నట్లు వాపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు పూజారి నరేష్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

Updated Date - 2022-05-25T09:48:21+05:30 IST