హిందూయిజం, హిందుత్వ వేర్వేరు: రాహుల్

ABN , First Publish Date - 2021-11-12T20:54:17+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకం ‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ను ఇటీవల..

హిందూయిజం, హిందుత్వ వేర్వేరు: రాహుల్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకం ‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్’ను ఇటీవల ఆవిష్కరించినప్పటి నుంచి 'హిందుత్వ' అంశంపై చర్య సాగుతోంది. పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే దీనిపై చర్చ జరుపుతున్నారు. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం స్పందించారు. హిందూయిజం, హిందుత్వ వేర్వేరనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.


''హిందూయిజం, హిందుత్వ ఒకటే అయితే, వాటికి వేర్వేరు పేర్లెందుకు? ఒకటే అయితే.. వాళ్లు హిందూయిజం అనే మాటనే వాడుతూ, హిందుత్వ అనే మాట ఎందుకు వాడటం లేదు?. స్పష్టంగా, ఆ రెండూ వేర్వేరు'' అని నేషనల్ ఓరియంటేషన్ క్యాంప్ ఫర్ ఆర్గనైజేషన్ ట్రైనింగ్ (సేవగ్రామ్ ఆశ్రమ్, వార్దా) వర్చువల్ మీట్‌లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ అన్నారు.


చైనాపై ప్రభుత్వానికి వ్యూహం లేదు..

చైనాపై భారత ప్రభుత్వానికి ఎలాంటి వ్యూహం లేదని, ఇది 'క్షమార్హం కాని రాజీ' అని రాహుల్ గాంధీఆరోపించారు. మిస్టర్ 56 (56 అంగుళాల ఛాతీ) భయపడుతున్నారని పరోక్షంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. సెక్యూరిటీపై క్షమార్హం కాని రాజీ కారణంగా సరిహద్దులను కావలి కాస్తున్న మన భద్రతా బలగాల ప్రాణాలు ప్రమాదంలో పడుతుండటం బాధ కలిగిస్తోందని అన్నారు.


''అందరినీ అభిమానించి, ఆదరించాలనే నేషలిస్టిక్ ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీది. ఇవాళ కాంగ్రెస్ ఐడియాలజీని ఆర్ఎస్ఎస్, బీజేపీ విద్వేష ఐడియాలజీ కప్పివేసి ఉండొచ్చు. మన ఐడియాలజీ మాత్రం సజీవమైనది, శక్తివంతమైనది. అయినప్పటికీ దానిని ఆర్‌ఎస్ఎస్, బీజేపీ ఐడియాలజీ కప్పివేస్తుండటానికి కారణం ఏమిటి? పార్టీ ఐడియాలజీని మనం సమర్ధవంతంగా, విస్తృతంగా ప్రచారం చేయలేకపోతున్నాం'' అని రాహుల్ పేర్కొన్నారు.

Updated Date - 2021-11-12T20:54:17+05:30 IST