Mp Gorantla Madhav అంశంలో వైసీపీ నేతల మల్లగుల్లాలు

ABN , First Publish Date - 2022-08-05T04:15:07+05:30 IST

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Hindupuram Mp Gorantla Madhav) అంశంలో వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ....

Mp Gorantla Madhav అంశంలో వైసీపీ నేతల మల్లగుల్లాలు

అమరావతి: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Hindupuram Mp Gorantla Madhav) అంశంలో వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని తొలుత నేతలు లీకులిచ్చారు. అయితే మాధవ్‌తోనే రాజీనామా చేయించాలని మరికొందరు నేతలు సూచిస్తున్నారు. ఈ అంశాలపైనే పార్టీలో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఈ రోజు రాత్రికి లేదా శుక్రవారానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


కాగా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ (Video Call) సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ మహిళ (Woman)తో గోరంట్ల మాధవ్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టుగా వీడియోలో ఉండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనను వైసీపీ (Ycp) నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయం సీఎం జగన్ (Cm Jagan) దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. మాధవ్‌పై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 



Updated Date - 2022-08-05T04:15:07+05:30 IST