ఆకాశానికి ఎగిసిన Hindustan Foods షేర్లు.. 15% పెరిగాయ్..

ABN , First Publish Date - 2022-07-22T17:32:04+05:30 IST

హిందుస్థాన్ ఫుడ్స్ షేర్లు నేడు ఆకాశానికి ఎగిశాయి. కంపెనీ స్టాక్ స్ల్పిట్‌ కోసం ఎక్స్ డేట్ మారిన తర్వాత షేర్లు అదరగొడుతున్నాయి.

ఆకాశానికి ఎగిసిన Hindustan Foods షేర్లు.. 15% పెరిగాయ్..

Hindustan Foods : హిందుస్థాన్ ఫుడ్స్ షేర్లు నేడు ఆకాశానికి ఎగిశాయి. కంపెనీ స్టాక్ స్ల్పిట్‌(Stock Split) కోసం ఎక్స్ డేట్(Ex Date) మారిన తర్వాత షేర్లు అదరగొడుతున్నాయి. రూ.10 ఫేస్ వాల్యూ నుంచి ఒక్కోటి రూ.2కు స్టాక్ స్ల్పిట్ కోసం గురువారం కంపెనీ ఎక్స్ డేట్‌ను ప్రకటించింది. దీంతో శుక్రవారం బీఎస్‌ఈ(BSE)లో కంపెనీ షేర్లు దాదాపు 15 శాతం పెరిగి రూ. 568కి చేరాయి. డైవర్సిఫైడ్ కంపెనీ స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతోంది. గడిచిన రెండు రోజుల్లో కంపెనీ షేర్లు 37 శాతం పెరిగాయి.


జూలై 22, 2022 రికార్డ్ డేట్‌..


గత నెలలో స్టాక్ 63 శాతం లాభపడింది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7.7 శాతం పెరిగింది. హిందుస్థాన్ ఫుడ్స్ 10 రూపాయల ముఖ విలువ కలిగిన ప్రతి 1 ఈక్విటీ షేరు(Equity Share)ను రూ. 2 ముఖ విలువ కలిగిన 5 ఈక్విటీ షేర్లుగా కంపెనీ విభజించే ఉద్దేశ్యంతో జూలై 22, 2022ని రికార్డ్ డేట్‌(Record date)గా నిర్ణయించింది. స్టాక్ స్ల్పిట్ చేయడానికి కారణం ఏంటంటే.. ఈక్విటీ షేర్లను వారికి మరింత చౌకగా మార్చడంతో పాటు.. రిటైల్ ఇన్వెస్టర్ల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం.. స్టాక్ మార్కెట్‌లలో కంపెనీ ఈక్విటీ షేర్ల లిక్విడిటీని పెంచడం ఈ విభజన వెనుక ఉన్న ఉద్దేశమని కంపెనీ పేర్కొంది.


స్టాక్ స్ప్లిట్ వల్ల ఉపయోగం ఏంటంటే..


స్టాక్ స్ప్లిట్ అనేది ఒక కార్పొరేట్ యాక్షన్. ఇక్కడ కంపెనీ తన ఒక్కో షేర్‌ను అనేక షేర్లుగా విభజిస్తుంది. స్ప్లిట్ షేర్‌లు కొత్త వాల్యూనూ యాడ్ చేయడం కానీ.. వాటాదారుల యాజమాన్య వాటాను తగ్గించడం కానీ చేయవు. ప్రధానంగా స్టాక్ స్ప్లిట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే.. కంపెనీ షేర్లు సాధారణంగా లిక్విడిటీలో పెరుగుదలను చూస్తాయి. షేర్లు ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లకు మరింత అందుబాటులోకి వచ్చాయి కాబట్టి.. డిమాండ్ పెరుగుతుంది. ఇది కౌంటర్‌లో లిక్విడిటీని పెంచుతుంది. స్టాక్ స్ప్లిట్ తర్వాత షేర్లను కొనడం, విక్రయించడం చాలా సులభం అవుతుంది.


Updated Date - 2022-07-22T17:32:04+05:30 IST