చారిత్రక ఆనవాలు కనుమరుగు..

ABN , First Publish Date - 2021-10-24T04:45:21+05:30 IST

అది.. చోళరాజుల కాలంలో నిర్మించిన మండపం.. చారిత్రక ఆనవాలు.. నేడు నెలకూలింది..

చారిత్రక ఆనవాలు కనుమరుగు..
రోడ్డు విస్తరణతో ఇలా కూల్చివేశారు..

 నేలకొరిగిన చోళరాజుల నాటి మండపం

అది.. చోళరాజుల కాలంలో నిర్మించిన మండపం.. చారిత్రక ఆనవాలు.. నేడు నెలకూలింది.. మన్నారుపోలూరులో చోళరాజుల కాలంనాటి అళఘు మల్లారికృష్ణస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ మాడవీధుల్లో నాలుగు మండపాలు ఉండేవి.  పూర్వం ఉత్సవాల్లో స్వామిని ఊరేగిస్తూ ఈ మండపాలలో దించి పూజలు చేసేవారని సమాచారం. ఆ మండపాలు శిథిలమైపోయి ఉన్నాయి. ప్రస్తుతం  సూళ్లూరుపేట - శ్రీకాళహస్తి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఓ మండపం అడ్డుగా ఉందని శనివారం కూల్చివేశారు. చారిత్రక ఆధారమైన మండపం నేలమట్టంపై గ్రామస్థులు తీవ్ర ఆవేదన చెందారు.

సూళ్లూరుపేట






Updated Date - 2021-10-24T04:45:21+05:30 IST