బుల్లెట్ ప్రూప్ కాఫీ గురించి మీకు తెలుసా? ఇది ఎలా ప్రారంభమయ్యిందంటే..

ABN , First Publish Date - 2022-07-06T13:34:44+05:30 IST

గత కొంత కాలంగా బుల్లెట్ ప్రూఫ్...

బుల్లెట్ ప్రూప్ కాఫీ గురించి మీకు తెలుసా? ఇది ఎలా ప్రారంభమయ్యిందంటే..

గత కొంత కాలంగా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగే ట్రెండ్ పెరిగింది. ఇది చాలా మంది సెలబ్రిటీల డైట్‌లో భాగంగా మారింది ఈ రకమైన కాఫీ చాలా కాలం నుండి వాడుకలో ఉన్నప్పటికీ, ఇప్పుడు దీనిని బుల్లెట్ ప్రూఫ్ కాఫీగా మార్చారు. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం, హిమాలయ ప్రాంతంలో నివసించే ప్రజలు చాలా కాలంగా దీనిని తాగుతున్నారు. ఇక్కడ తయారుచేసే కాఫీలో వెన్నను ఉపయోగిస్తారు. అందుకే దీన్ని బటర్ కాఫీ అని కూడా అంటారు. ఎత్తయిన ప్రదేశాలలో నివసించే వ్యక్తులు ఈ రకమైన పానీయాలను తాగుతుంటారు. ఈ విధంగా వారు ఎక్కువ శారీరక శక్తిని పొందుతారు. 


బటర్ కాఫీని బుల్లెట్ ప్రూఫ్ కాఫీగా మార్చిన ఘనత అమెరికన్ వ్యవస్థాపకుడు డేవ్ ఆస్ప్రేకు దక్కుతుంది. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లో ఈ కాఫీ ట్రెండ్‌లో ఉంది. భారతదేశంలోనూ దీనికి ప్రజాదరణ పెరుగుతోంది. కీటో డైట్‌ని అనుసరించే వ్యక్తుల ఆహారంలో బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ ఒక ముఖ్యమైన భాగం. నిపుణులు ఈ కాఫీ ప్రయోజనాలను వివరించారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని, శరీరంలోని కొవ్వును తగ్గించడంలో ఈ కాఫీ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వెన్నలో మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. స్థూలకాయులు తమ శరీర బరువు తగ్గడానికి దీనిని ఆశ్రయిస్తున్నారు. 

Updated Date - 2022-07-06T13:34:44+05:30 IST