సినిమాలకు ట్రైలర్ ఐడియా ఎలా మొదలయ్యిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-05-04T14:23:54+05:30 IST

ఏదైనా కొత్త సినిమా రీలీజ్ అవబోతుంటే దానికి...

సినిమాలకు ట్రైలర్ ఐడియా ఎలా మొదలయ్యిందో తెలిస్తే..

ఏదైనా కొత్త సినిమా రీలీజ్ అవబోతుంటే దానికి ముందుగా ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలవుతుంది. దీనిని చూసిన ప్రేక్షకుడు ఒక అభిప్రాయానికి వచ్చి, ఆ తరువాత సినిమాకు వెళ్లాలా వద్దా అనేది నిర్ణయించుకుంటాడు. అందుకే ఇప్పుడు ట్రైలర్ ఎప్పుడు తొలిసారిగా రూపొందించారో తెలుసుకుందాం. తొలినాళ్లలో సినిమాలకు ట్రైలర్ అనే సంప్రదాయం లేదు. ఇప్పుడు ప్రతీ సినిమాకు ట్రైలర్ వస్తుంటుంది. 1913లో మొదటిసారిగా సినిమాకు ట్రైలర్‌ను రూపొందించారు. అప్పట్లో థియేటర్‌లో ఒక సినిమా చూసినవారికి తర్వాత రాబోయే సినిమా ట్రైలర్ చూపించేవారు. అది రాబోయే సినిమాకు ప్రకటన మాదిరిగా ఉండేది. ఈ ట్రెండ్‌ బ్రాడ్‌వే నిర్మాత నిల్స్ గ్రాన్‌లండ్ తీసుకువచ్చారు. అతనిని ట్రైలర్ పితామహునిగా చెబుతారు. అయితే ఈ ట్రైలర్‌ను సినిమా చివర్లో ట్రైలర్ చూపించడం వల్ల చాలా తక్కువ మంది మాత్రమే ట్రైలర్ చూసేవారు. ఆ తర్వాత ఈ పద్ధతిని మార్చి ట్రైలర్‌ని మొదట్లో చూపించడం మొదలు పెట్టారు. 

Read more