హిజాబ్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం

ABN , First Publish Date - 2022-03-21T17:27:22+05:30 IST

హిజాబ్‌ ఇస్లాం మతంలో తప్పనిసరి ఆచారం కాదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తమకు న్యాయసమ్మతం కాదని, దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవాలని నిర్ణయించినట్లు

హిజాబ్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం

                   - అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు


బెంగళూరు: హిజాబ్‌ ఇస్లాం మతంలో తప్పనిసరి ఆచారం కాదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు తమకు న్యాయసమ్మతం కాదని, దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవాలని నిర్ణయించినట్లు అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రకటించింది. ఈ మేరకు నగరంలో ఆదివారం ఒక ప్రకటన విడుదలైంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా సరే హిజాబ్‌ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసినా రెచ్చిపోవద్దని, వివాదాల జోలికి వెళ్లకుండా సంయమనంతో వ్యవహరించాలని ముస్లిం సముదాయానికి విజ్ఞప్తిచేసింది. న్యాయమూర్తులను బెదిరించడం మంచి సంప్రదాయం కాదని, దీని వల్ల  సమస్య మరింత జటిలం అవుతుందని బోర్డు ప్రకటన పేర్కొంది.

Updated Date - 2022-03-21T17:27:22+05:30 IST