ఎంఈఓ కార్యాలయంలో విచారిస్తున్న రాయచోటి విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్
చిన్నమండెం, జనవరి 21: విద్యాశాఖాధికారి శివనాయక్, బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు జయచంద్ర నడు మ వాదం జగడానికి దా రితీసింది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో మూ డు కిలోమీటర్లలోపు పా ఠశాలలను విలీనం చే యాల్సి ఉంది. ఇందులో భాగంగా దేవగుడిపల్లె పాఠశాలను విలీనం చేయాలంటూ హెచ్‌ఎం, విలీన ప్రక్రియ కాదంటూ ఎంఈఓ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది కాస్త గొడవ వరకు దారి తీసింది. విషయం తెలుసుకున్న రాయచోటి విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్ చిన్నమండెం ఎంఈఓ కార్యాలయంలో విచారణ చేపట్టారు.