నీ ఉద్యోగం తీయించేస్తా: సీఆర్పీకి హెచ్ఎం వార్నింగ్

ABN , First Publish Date - 2021-08-25T00:38:43+05:30 IST

జిల్లాలోని ద్వారకా తిరుమల ఎంఈఓ ఆఫీసులో ఉపాధ్యాయుల మధ్య తీవ్ర స్థాయిలో

నీ ఉద్యోగం తీయించేస్తా: సీఆర్పీకి హెచ్ఎం వార్నింగ్

పశ్చిమగోదావరి: జిల్లాలోని ద్వారకా తిరుమల ఎంఈఓ ఆఫీసులో ఉపాధ్యాయుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ తలెత్తింది. నీ ఉద్యోగం తీయించేస్తా అని సీఆర్పీకి హెచ్ఎం వార్నింగ్ ఇచ్చాడు. పాఠశాలలకు బుక్స్ తీసుకెళ్లే  క్రమంలో వివాదం చోటు చేసుకుంది. రామ సింగవరం ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సుబ్బారావు, తన తోటి  ఉపాధ్యాయులతో కలిసి స్కూల్‌కి బుక్స్ తీసుకెళ్ళేందుకు ద్వారకా తిరుమల ఎంఈఓ ఆఫీస్‌కి వెళ్ళాడు. అక్కడ స్కూల్‌కి కావాల్సిన బుక్స్ తీసుకున్న తర్వాత హెచ్ఎం సుబ్బారావుని రిసీవ్డ్ సంతకం పెట్టవలసిందిగా జి. కొత్తపల్లి సీఆర్పీ జయకుమార్  కోరాడు. 


దీంతో ఆగ్రహించిన హెచ్ఎం సుబ్బారావు, సీఆర్పీ జయ కుమార్‌ను ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడి నీ ఉద్యోగం తీయించేస్తానంటూ అతడిని బెదిరింపులకు గురి చేశాడు. అంతేకాక తనతో పాటు వచ్చిన తోటి ఉపాధ్యాయులు హెచ్ఎం సుబ్బారావుకి సర్ది చెప్పడానికి ప్రయత్నించగా వారిని సైతం అక్కడ ఉన్న కుర్చీతో కొట్టబోయాడు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. హెచ్ఎం సుబ్బారావు తీరుపై తోటి ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తోటి ఉపాధ్యాయుల పట్ల హెచ్ఎం సుబ్బారావు ప్రవర్తన సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-08-25T00:38:43+05:30 IST