కాకినాడ స్పోర్ట్స్,
మార్చి 27: హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జిల్లా హాకీ సంఘ సహకారంతో
కాకినాడలో జరుగుతున్న 12వ జాతీయ స్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీలు ఆదివారం
హోరాహోరీ గా జరిగాయి. పంజాబ్, ఛత్తీస్‌ఘఢ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో
పంజాబ్ 6-0 స్కోర్‌తోను, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో
9-0 స్కోర్‌తో ఉత్తర్‌ప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో
మిజోరాం 2-3 స్కోర్‌తో, బెంగాల్, ఆంధ్ర మధ్య జరిగిన మ్యాచ్‌లో 4-2
స్కోర్‌తో బెంగాల్ జట్టు విజయం సాధించాయి. ఈ పోటీలలో ఆంధ్రా జట్టు లీగ్
దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించి నిరాశ పరిచింది. పోటీలను జిల్లా
హాకీ సంఘం కార్యదర్శి నంబు శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ,
డీఎస్పీ శివప్రసాద్, హాకీ సంఘ సభ్యులు రామకృష్ణ, వాలీబాల్ సంఘ అధ్యక్షుడు
వై.బంగార్రాజు తిలకించారు. సీనియర్ హాకీ క్రీడాకారులు పి.సత్యగౌరి,
నాగమణి, సుధారాణి, శ్రావణి, వి.సుధారాణి, ఎం.దుర్గాదేవి, స్వామి, నందిని,
సూరిబాబు, పరశురాం, బాబ్జి, అవినాష్, గంగాధర్, మూర్తి పోటీల నిర్వహణలో
వివిధ కమిటీలను నిర్వహిస్తూ సహకారం అందించారు. పోటీలను హాకీ సంఘ రాష్ట్ర
కార్యదర్శి హర్షవర్థన్‌రెడ్డి, టోర్నమెంట్ కో-ఆర్డినేటర్ వి. రవిరాజు,
టోర్నమెంట్ డైరెక్టర్ మహ్మద్ పర్యవేక్షించారు.