హోల్‌ గ్రెయిన్‌ బ్రెడ్‌ లాభాలేమిటి?

ABN , First Publish Date - 2021-06-12T22:18:33+05:30 IST

సాధారణంగా దొరికే వైట్‌ బ్రెడ్‌ మైదాతో చేస్తారు. హోల్‌ గ్రెయిన్‌ అంటే ముడిధాన్యాలు. హోల్‌ గ్రెయిన్‌ బ్రెడ్‌ను పొట్టు తీయని గోధుమలతో తయారు చేస్తారు. అందుకే హోల్‌ గ్రెయిన్‌ బ్రెడ్‌లో ఆరోగ్యకరమైన

హోల్‌ గ్రెయిన్‌ బ్రెడ్‌ లాభాలేమిటి?

ఆంధ్రజ్యోతి(12-06-2021)

ప్రశ్న: మామూలు బ్రెడ్‌ కన్నా హోల్‌ గ్రెయిన్‌ బ్రెడ్‌ ఉపయోగించడం వల్ల ఏవైనా ఉపయోగాలున్నాయా?


- లక్ష్మిశ్రీ, విజయవాడ


డాక్టర్ సమాధానం: సాధారణంగా దొరికే వైట్‌ బ్రెడ్‌ మైదాతో చేస్తారు. హోల్‌ గ్రెయిన్‌ అంటే ముడిధాన్యాలు. హోల్‌ గ్రెయిన్‌ బ్రెడ్‌ను పొట్టు తీయని గోధుమలతో తయారు చేస్తారు. అందుకే హోల్‌ గ్రెయిన్‌ బ్రెడ్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు వైట్‌ బ్రెడ్‌ కంటే అధికంగా ఉంటాయి. హోల్‌ గ్రెయిన్‌ బ్రెడ్‌ లోని పీచు పదార్థాలు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మంచిది. ఇనుము, మెగ్నీషియం, జింక్‌, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శక్తినిచ్చేనందుకు కూడా ఇది మంచిది. వైట్‌ బ్రెడ్‌తో పోలిస్తే హోల్‌ గ్రెయిన్‌ బ్రెడ్‌లో కెలోరీలు కూడా కొంచెం తక్కువ. అయితే, మార్కెట్లో లభించే బ్రెడ్‌లలో చాలా వరకు రుచి కోసం చక్కర కలపడం వల్ల వైట్‌ బ్రెడ్‌ లేదా హోల్‌ గ్రెయిన్‌ బ్రెడ్‌ ఏదైనా అధిక కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటున్నాయి. కాబట్టి వీటిని వాడాల్సి వచ్చినప్పుడు హోల్‌ గ్రెయిన్‌ బ్రెడ్‌ తీసుకోవచ్చు. కానీ, రోజూ తీసుకోవడానికి గోధుమ పిండి లేదా వేరే ముడిధాన్యాల పిండితో ఇంట్లో చేసుకొనే రొట్టెలు అన్నిటికంటే ఆరోగ్యకరమైనవి. 


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-06-12T22:18:33+05:30 IST