‘విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి’

ABN , First Publish Date - 2021-04-19T05:24:25+05:30 IST

కరోనా కేసులు పెరుగుతున్నాయని, విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ఏఐడీఎస్‌వో రాష్ట్ర కార్యదర్శి హరీష్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

‘విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి’
మాట్లాడుతున్న డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిమ్మప్ప

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 18: కరోనా కేసులు పెరుగుతున్నాయని, విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ఏఐడీఎస్‌వో రాష్ట్ర కార్యదర్శి హరీష్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం నగరంలోని కార్యాలయంలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ు. రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపుల్‌ సెక్రటరీ, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలతో సమీక్షించి సెలవులను ప్రకటించాలన్నారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి విశ్వనాథ్‌ రెడ్డి, ప్రియాంక, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 


ఉపాధ్యాయులు, విద్యార్థులు వైరస్‌ బారిన పడుతున్నారని, వెంటనే వేసవి సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర, జాతీయ ఉపాధ్యాయ పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం షరీఫ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం కర్నూలులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విద్యాసంవత్సరం ఆలస్యం ప్రారంభమైనా కుదించిన నిర్ణీత సిలబస్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతి ఏడాది ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నారని, ఇప్పుడు కూడా అదే విధంగా వేసవి సెలవులు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 1 నుంచి 9వ తరగతి వరకు ప్రమోట్‌ చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. 10వ తరగతి పరీక్షలపై పునరాలోచించాలన్నారు. సమావేశంలో ఆర్‌జేయూపీ నారాయణ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకట్రాముడు, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. 


రాష్ట్రంలో కరోనా రోజురోజుకు తీవ్రతరమవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడుతున్నారని, వెంటనే పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని డీటీఎఫ్‌ జిల్లా శాఖ డిమాండ్‌ చేసింది. ఆదివారం నగరంలోని డీటీఎఫ్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రత్నం ఏసేపు, జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారని అన్నారు. నాడు-నేడు పనుల ఒత్తిడి పెంచి ప్రభుత్వం టీచర్లు, విద్యార్థులతో చెలగాటమాడుతోందన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే అన్ని జాగ్రత్తలతో పాఠశాలలు నడపాలన్నా రు. సమగ్ర శిక్ష అభియాన్‌లో జరిగిన అవినీ తిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావే శంలో డీటీఎఫ్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-19T05:24:25+05:30 IST