అమెరికాలో తెలుగువారికి హోం కొవిడ్ టెస్టింగ్ కిట్లు
ABN , First Publish Date - 2022-01-04T13:02:45+05:30 IST
నూతన సంవత్సరం సందర్భంగా సామాజిక సేవలో భాగంగా అమెరికాలోని తెలుగు కుటుంబాలకు గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్), చేతన ఫౌండేషన్ సంయుక్తంగా హోం కొవిడ్ టెస్టింగ్ కిట్లను పంపిణీ చేశాయి.
అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరం సందర్భంగా సామాజిక సేవలో భాగంగా అమెరికాలోని తెలుగు కుటుంబాలకు గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జీడబ్ల్యూటీసీఎస్), చేతన ఫౌండేషన్ సంయుక్తంగా హోం కొవిడ్ టెస్టింగ్ కిట్లను పంపిణీ చేశాయి. ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకునేందుకు ఉపయోగించుకునే కిట్లును సోమవారం ఈ సంఘాలు అందజేశాయి. కార్యక్రమంలో జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షురాలు సాయిసుధ, తానా మాజీ అధ్యక్షుడు సతీశ్ వేమన, త్రిలోక్, అనిల్, రాంచౌదరి తదితరులు పాల్గొన్నారు.