ఇంటింటి జ్వర సర్వే

ABN , First Publish Date - 2021-05-09T05:03:09+05:30 IST

ఇంటింటి జ్వర సర్వే

ఇంటింటి జ్వర సర్వే
శంకర్‌పల్లి: సర్వేను పరిశీలిస్తున్న చైర్‌పర్సన్‌ ఎస్‌.విజయలక్ష్మి

ఆమనగల్లు: జ్వర సర్వేను ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండలాల పరిధిలో ముమ్మరం చేశారు. శనివారం మూడు మండలా ల్లోని గ్రామాల్లో సర్వే టీంలు ఇంటింటా సర్వే నిర్వహించారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది బృందాలుగా ఇంటింటికి వెళ్లి జలు బు, దగ్గు, జ్వరం, శ్వాసకోస ఇబ్బందులు ఎవరికైనా ఉన్నాయా? రికార్డు చేస్తున్నారు. లక్షణాలున్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. సర్వేకు ప్రజలు సహకరించి ఆరోగ్య వివరాలు తెలియజేయాలని ఎంపీడీవోలు వెంకట్రాములు, రామకృష్ణ, రాఘవులు, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌ కోరారు. ఆమనగల్లులో సర్వేను ఎంపీపీ అనితవిజయ్‌, జడ్పీటీసీ అనురాధ, ఎంపీటీసీ కుమార్‌, సర్పంచ్‌లు శ్రీపాతి రజితశ్రీనివాస్‌రెడ్డి, గోదాదేవిసత్యం, శీనయ్య పరిశీలించారు. తలకొండపల్లి మండలం వీరన్నపల్లిలో సర్పంచ్‌ నాగమణి, పంచాయతీ కార్యదర్శి జంగయ్య, అంగన్‌వాడీ టీచర్‌ కృష్ణవేణి, ఆశా వర్కర్‌ శోభారాణి, పాల్గొన్నారు. కొలికిరాళ్లతండాలో ఆశ వర్కర్‌ సంతోష ఇంటింటి సర్వే నిర్వహించారు. కడ్తాల మండల గ్రామాల్లో జ్వర సర్వేను జడ్పీటీసీ దశరథ్‌, ఎంపీపీ కమ్లి, పీఎసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌ పరిశీలించారు. 


  • ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి


శంకర్‌పల్లి: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ వారివారి ఇంట్లోనే ఉండి జాగ్రత్తలను తీసుకోవాలని మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ సాత విజయలక్ష్మిప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి ఒక్కరి ఉష్ణోగ్రత, ఇతర ఆరోగ్య సమస్యలను పరీక్షిస్తామ ని తెలిపారు. వచ్చే సోమవారం నుంచి శంకర్‌పల్లిలో 14 రోజులపాటు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని తెలిపారు. కమిషనర్‌ యాదగిరి పాల్గొన్నారు.


  • మాస్కులు, శానిటైజర్లు పంపిణీ


చేవెళ్ల/కందుకూరు: కరోనా వైర్‌స కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అల్లావాడ ఎంపీటీసీ వడ్ల సత్యనారాయణచారి అన్నారు. చేవెళ్ల మండలం పామెనంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. సర్పంచ్‌ మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్‌, యూత్‌ అధ్యక్షుడు వినోద్‌కుమార్‌, వార్డు సభ్యులు విష్ణువర్ధన్‌రెడ్డి, పద్మమ్మ పాల్గొన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటించాలని కందుకూరు మండల యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కత్తుల వెంకటేష్‌ కోరారు. మాజీ జ డ్పీటీసీ జంగారెడ్డి సహకారంతో మాస్కులు, శానిటైజర్లను బాచుపల్లిలో పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్‌ ఆరోగ్యరెడ్డి, అంబేద్కర్‌ సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌, వార్డుసభ్యులు రాఘవేందర్‌, షేక్‌ మదార్‌, యాదయ్య, శ్యామలరవి, థామ్‌సరెడ్డి, గోపాల్‌గుప్తా పాల్గొన్నారు.


  • టీకా ముందు మండల వాసులకే  వేయాలి


కందుకూరు: కరోనా టీకాను మండల వాసులకే ముందు వేయాలని కాంగ్రెస్‌ పార్టీ జడ్పీ మాజీ ఫ్లోర్‌లీడర్‌ జంగారెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ కందుకూరు, రాచులూరు, లేమురు ఆరోగ్య కేంద్రాల్లో టీకాలను మొదట నగరవాసులకు వేస్తున్నారని, దీంతో మ ండల ప్రజలకు టీకా కొరత ఏర్పడుతోందని తెలిపారు.

Updated Date - 2021-05-09T05:03:09+05:30 IST