హోమ్ ఐసోలేషన్ నియమాలు ఉల్లంఘిస్తే ఆసుపత్రులకు తరలింపు!

ABN , First Publish Date - 2020-09-23T13:43:40+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతోపాటు, హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నబాధితుల జాబితా కూడా రెండింతలవుతోంది. ఈ నేపధ్యంలో కొంతమంది ఐసోలేషన్ బాధితులు కరోనా వ్యాప్తి నివారణ...

హోమ్ ఐసోలేషన్ నియమాలు ఉల్లంఘిస్తే ఆసుపత్రులకు తరలింపు!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతోపాటు, హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నబాధితుల జాబితా కూడా రెండింతలవుతోంది. ఈ నేపధ్యంలో కొంతమంది ఐసోలేషన్ బాధితులు కరోనా వ్యాప్తి నివారణ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇటువంటి కరోనా బాధితులను గుర్తించి కోవిడ్ ఆసుపత్రులకు తరలించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది. 



ఢిల్లీలో గడచిన 20 రోజుల్లో హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నవారి సంఖ్య 10 వేలకు పైగా పెరిగింది. ఈ నేపధ్యంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్ ఢిల్లీ ఆరోగ్యశాఖకు కోవిడ్-19 నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్లపై మరింతగా దృష్టి సారించాలని కోరారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్న కొంతమంది నియమాలను ఉల్లంఘిస్తున్నారని  అటువంటివారిని గుర్తించి, ఆసుపత్రులకు, కోవిడ్ కేంద్రాలకు తరలించాలని సూచించారు. 

Updated Date - 2020-09-23T13:43:40+05:30 IST