గుంటూరు: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు జరిపిన దాడిలో వీరమరణం పొం దిన గుడిపూడికి చెందిన సీఎస్పీఎఫ్ జవాన్ శాఖమూరి మురళీకృష్ణ కుటుంబసభ్యులను హోం మత్రి మేకతోటి సుచరిత బుధవారం పరామర్శించారు. మురళీకృష్ణ చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ము రళీకృష్ణ మృతి అత్యంత బాధాకరమన్నారు. మురళీకృష్ణ తల్లిదండ్రులు విజయకుమారి, రవీంద్రబాబులను ఓదార్చి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పా రు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.