తెలంగాణలో అన్ని వర్గాలకు సమాన గౌరవం ఉంది: హోంమంత్రి

ABN , First Publish Date - 2022-03-21T21:22:16+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలకు సమాన గౌరవం వుందని హోంమంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు.

తెలంగాణలో అన్ని వర్గాలకు సమాన గౌరవం ఉంది: హోంమంత్రి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలకు సమాన గౌరవం వుందని హోంమంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు సమాన గౌరవం,ప్రాధాన్యత కల్పిస్తూ సెక్యులర్ నాయకుడిగా ఉన్నారని అన్నారు. బోధన్ లో జరిగిన సంఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్అలీ, రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ,నిజామాబాద్ కమీషనర్ కే.ఆర్ నాగరాజు లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితి అదుపులో ఉందని, కమిషనర్ ఇతర పోలీసు అధికారులు బోధన్ లోనే ఉండి పరిస్థితులు సమీక్షిస్తున్నారని డిజిపి హోం మంత్రికి వివరించారు.


ఉద్రిక్తత లకు దారి తీసిన పరిస్థితుల పై హోం మంత్రి ఆరాతీశారు.ఘర్షణ వాతావరణాన్ని అదుపు చేశామని అని డీజీపి  హోం మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు సమానమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తతో ఉన్నారని.. ప్రజలు పోలీసులకు సహకరించాలని...హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-03-21T21:22:16+05:30 IST