సర్దుకుపోండి!

ABN , First Publish Date - 2022-08-10T06:21:54+05:30 IST

కొవ్వూరు నియోజకవర్గంలో హోంమంత్రి తానేటి వనిత.. ఓ సామాజిక వర్గం మధ్య ఏర్పడిన వివాదం అసంతృప్తితోనే ముగిసినట్టు సమాచారం.

సర్దుకుపోండి!
హోంమంత్రి తానేటి వనిత

మంత్రి వనిత, రాజీవ్‌ కృష్ణ సమక్షంలో కొవ్వూరు పంచాయితీ

రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో 4 గంటల పాటు చర్చలు

అసంతృప్తిగానే నాయకులు


(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

 కొవ్వూరు నియోజకవర్గంలో హోంమంత్రి తానేటి వనిత.. ఓ సామాజిక వర్గం మధ్య ఏర్పడిన వివాదం అసంతృప్తితోనే ముగిసినట్టు సమాచారం. ఇటీ వల కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రి తానేటి వనితకు తాము సహాయ నిరాకరణ చేస్తున్నామని ఓ సామాజికవర్గం సమావేశమై  నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ దీనిపై ఆమె మౌనం వహించారు.కానీ రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంత్రి తానేటి వనిత, వైసీపీ నేత, కృష్ణబాబు అల్లుడు రాజీవ్‌కృష్ణ సమక్షంలో  సహాయ నిరాకరణ ప్రకటించిన వారిలో సుమారు 15 మందితో చర్చలు జరిగాయి. మొదట ఓ సామాజిక వర్గం నేతలే తమ అసంతృప్తికి గల కారణాలు మంత్రికి వివరించినట్టు తెలిసింది. సుమారు రూ.70 కోట్ల ఉపాధిహామీ నిధులు వృథా కావడం, గ్రామాల్లోని నాయకత్వాన్ని ధ్వంసం చేస్తూ, ప్రత్యామ్నాయంగా బహుళనాయకత్వం ప్రోత్సహించడం, జడ్పీ నిధులు జడ్పీటీసీలకు చెప్పకుండానే ఖర్చు చేయడం వంటి అంశాలను ప్రస్తావించినట్టు తెలిసింది. ఇటీవల వచ్చిన వివాదంలో సోషల్‌ మీడియాలో నామినేటెడ్‌ పదవులన్నీ ఒక వర్గానికి ఇస్తున్నట్టు, కోడిపందాలు, ఇసుక ర్యాంపులన్నీ వారికే ఇస్తున్నట్టు చేస్తున్న ఆరో పణలను ఖండించాలి కదా అని కూడా మంత్రిని కొందరు అడిగినట్టు సమాచారం. గ్రామాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై ఆమె ఏమీ సమాధానం చెప్ప లేనట్టు సమాచారం.కానీ జడ్పీ నిధు లు ఇక జడ్పీటీసీలే ఖర్చు చేసుకునేటట్టు,జడ్పీ చైర్మన్‌కు కూడా చెబుతానని ఆమె అన్నట్టు తెలిసింది. తాను హోంమంత్రిగా ఉండ డం వల్ల చాలా విషయాలు పట్టించుకోలేకపోతున్నానని..అంత బిజీగా ఉంటున్నానని ఆమె చెప్పినట్టు సమాచారం.పీఏ, పీఎస్‌లు ఎవరూ ఫోన్‌లు ఎత్తడంలేదని.. కానిస్టేబుల్‌ పరిష్కరించే సమస్య అయినా నేరుగా మంత్రికే చెప్పవలసి వస్తుందని కొందరు వాపోయినట్టు తెలిసింది. వైసీపీ ప్రముఖుడు, సీనియర్‌ నేత పెండ్యాల కృష్ణబాబు అల్లుడు, పరిశ్రమల విభాగం ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌కృష్ణ జోక్యం చేసుకుని సర్దుకుపోయి పనిచేయాలని, ప్రతి విషయాన్ని పెంచుకుంటే పోతే పార్టీకి నష్టం జరుగుతుందనిఅందరికీ నచ్చచెప్పినట్టు సమాచారం.ఇక రెండేళ్లలో ఎన్ని కలు జరగనున్నాయని..ఈ లోపు పార్టీలో ఇటువంటి తగవులు మంచివి కాదని చెప్పినట్టు తెలిసింది. కానీ అందరూ అసంతృప్తితోనే ఊకొట్టినట్టు తెలిసింది.


ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ చూడడానికి వచ్చారు..


సమావేశంలో మంత్రి తానేటి వనితను ప్రశ్నించగా.. అవును. మా పార్టీ వాళ్లంతా ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ చూడడానికి వచ్చారు.. కాసేపు మాట్లాడుకున్న తర్వాత శ్రీకన్య నుంచి మంచి బిర్యాన్ని తెచ్చుకుని తిన్నామని..అంతే తప్ప మా మధ్య గొడవలేమీ లేవన్నారు. ఇటీవల ఓ సామాజికవర్గం  సమావేశమై  సహాయ నిరాకరణ ప్రకటించిందికదా అన్ని ప్రశ్నించగా.. చాగల్లు మండలంలో సమావేశం కావడం నిజమేనని.. సమావేశమైన ప్రాం తం కూడా తమ పార్టీ నేతదేనని, అక్కడ కూర్చుని మంచిచెడ్డా మాట్లాడుకున్నారంతేనన్నారు. ‘ఆంధ్రజ్యోతి’కి నాపై కాస్త ప్రేమ ఎక్కువ అనీ.. కాస్త మసాలా జోడించారని ఆమె అన్నారు.

Updated Date - 2022-08-10T06:21:54+05:30 IST