సహకార వ్యవస్థను బలోపేతం చేయాలి

ABN , First Publish Date - 2021-07-25T05:13:17+05:30 IST

రైతులకు తక్కువ వడ్డీకి రుణాలిచ్చే సహకార వ్యవస్థను బలోపేతం చేయాలని హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు.

సహకార వ్యవస్థను బలోపేతం చేయాలి
సభలో ప్రసంగిస్తున్నమంత్రి సుచరిత, వేదికపై ఎంపీ మోపిదేవి, మేయర్‌ మనోహర్‌, ఎమ్మెల్యేలు రోశయ్య, ముస్తఫా, గిరి తదితరులు

హోంమంత్రి సుచరిత 

గుంటూరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రైతులకు తక్కువ వడ్డీకి రుణాలిచ్చే సహకార వ్యవస్థను బలోపేతం చేయాలని హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారరంగాన్ని పునర్‌ వ్యవస్తీకరిస్తున్నట్లు తెలిపారు. గుంటూరులోని డీసీసీబీ ప్రధానకార్యాలయం ఎన్టీఆర్‌ సహకారభవనలో శనివారం రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాల్‌పురంరాము) చైర్మనగా బాధ్యతలను బ్యాంక్‌ పర్సన ఇనచార్జి, జేసీ (రెవెన్యూ, రైతుభరోసా) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ అప్పగించారు. ఈ సందర్భంగా పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి సుచరిత  మాట్లాడుతూ లాల్‌పురం రాము బ్యాంక్‌ను ప్రగతిపథంలో నడపాలని ఆకాంక్షించారు. రాజ్యసభసభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ రైతులకు సకాలంలో సక్రమంగా రుణాలివ్వాలన్నారు.  సీఎం జగన ఆశయాలకు అనుగుణంగా పాలకవర్గం పనిచేయాలన్నారు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ జాతీయ బ్యాంకులతో సహకార సంస్థలు పోటీపడాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ముస్తఫా, విడదల రజని, కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, లేళ్ళ అప్పిరెడ్డి, జంగా కృష్ణ మూర్తి, మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్‌  వనమా బాలవజ్రబాబు (డైమండ్‌ బాబు), మద్యపాన నిషేధ ప్రచార కమిటీ చైర్మన వి.లక్ష్మణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, డీసీఎంఎస్‌ మాజీ చైర్‌పర్సన హెన్రీ క్రిస్టినా, రాష్ట్ర గ్రంథాలయ పరిషత  చైర్మన మందపాటి శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన బత్తుల దేవానంద్‌, దివ్యాంగుల కార్పొరేషన చైర్మన ముంతాజ్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, షౌకత ఆలి, అంగడి శ్రీనివాసరావు, సీఈవో కృష్ణవేణి, జడ్పీ సీఈవో డి.చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఛైర్మన రాముతోపాటు ఆరుగురు పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. బ్యాంక్‌ చైర్మనగా రెండోసారి తనకు అవకాశం ఇచ్చినందుకు  రాము సీఎం జగనకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-07-25T05:13:17+05:30 IST