దివ్యాంగులకు ప్రభుత్వ ప్రోత్సాహం

ABN , First Publish Date - 2021-12-04T05:24:42+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర హోంమంత్రి ఎం.సుచరిత అన్నారు.

దివ్యాంగులకు ప్రభుత్వ ప్రోత్సాహం
సమావేశంలో ప్రసంగిస్తున్న హోంశాఖ మంత్రి ఎం.సుచరిత

హోం మంత్రి  ఎం.సుచరిత

పెదకాకాని, డిసెంబరు 3: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర హోంమంత్రి ఎం.సుచరిత అన్నారు. మండలంలోని వెనిగండ్ల గ్రామంలో శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అన్ని జిల్లాల భవిత కేంద్రాల నుంచి వచ్చిన విభిన్న ప్రతిభావంతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ దివ్యాంగులు ఏ అంశాల్లో ఇతరులకు తీసుపోరని, తగిన ప్రోత్సాహం ఉంటే చక్కగా  రాణిస్తారన్నారు. ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఓర్పు సహనంతో విద్యార్థులను తీర్చిదిద్దారని అభినందించారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌, కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యూకేషన్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ ఏ.వెట్రిసెల్వి, పాఠశాల సంయుక్త సంచాలకులు వి.సుబ్బారావు, డీఈవో గంగాభవాని, ఎంఈవో బలిరామ్‌నాయక్‌, పాఠశాల హెచ్‌ఎం కళ్యాణి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-04T05:24:42+05:30 IST