Anakapalli చిన్నారి, బీటెక్ విద్యార్థిని ఘటనలపై Home minister స్పందన

ABN , First Publish Date - 2022-05-06T20:44:41+05:30 IST

అనకాపల్లి చిన్నారి ఘటన, శ్రీ సత్యసాయి జిల్లా తేజశ్విని సంఘటనలపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు.

Anakapalli చిన్నారి, బీటెక్ విద్యార్థిని ఘటనలపై Home minister స్పందన

రాజమండ్రి: అనకాపల్లి చిన్నారి ఘటన, శ్రీ సత్యసాయి జిల్లా తేజశ్విని సంఘటనలపై  హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. అనకాపల్లి ఘటన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆరు బృందాలతో గాలించి నిందితుడిని పట్టుకున్నట్లు అనకాపల్లి ఎస్పీ హోంమంత్రికి తెలిపారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు హోంమంత్రి సూచించారు. బాధిత కుటుంబసభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 


శ్రీ సత్యసాయి జిల్లా తేజశ్విని సంఘటనలో నిందితుడు సాదిక్‌ను వెంటనే అరెస్ట్ చేసినట్లు ఎస్పీ హోంమంత్రికి తెలిపారు. తేజస్విని తల్లిదండ్రులు కోరినట్లు రీ పోస్టు మార్టం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చిన్నారులపై, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి తానేటి వనిత హెచ్చరించారు.

Read more