చంద్రబాబు ఆ విషయంలో రాజకీయం చేశారు: హోంమంత్రి వనిత

Published: Tue, 26 Apr 2022 17:53:57 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చంద్రబాబు ఆ విషయంలో రాజకీయం చేశారు: హోంమంత్రి వనిత

ఏలూరు: అత్యాచార బాధితురాలి పరామర్శను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాజకీయం చేశారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు.మంగళవారం హోంమంత్రి వనిత మీడియాతో మాట్లాడుతూ.. ఆ ఘటనలో 3 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామన్నారు. మహిళలకు జగన్ అండగా ఉన్నారని టీడీపీ ఫ్రస్ట్రేషన్‌లో ఉందన్నారు. గత ప్రభుత్వంలో మహిళలపై దారుణాలు జరిగితే బయటకు వచ్చేవి కావన్నారు.వైసీపీ ప్రభుత్వంపై నమ్మకంతో బాధితులు బయటకు వస్తున్నారని చెప్పారు. అందుకే ఈ ప్రభుత్వంలో అత్యాచార కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుందని వనిత తెలిపారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.