చర్మం పొడిబారకుండా..

ABN , First Publish Date - 2020-12-26T05:52:16+05:30 IST

చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. వాటి నుంచి బయటపడేందుకు ఉపయోగపడే కొన్ని టిప్స్‌...

చర్మం పొడిబారకుండా..

చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. వాటి నుంచి బయటపడేందుకు ఉపయోగపడే కొన్ని టిప్స్‌...


  1. చర్మం పొడారిపోకుండా ఉండడానికి చల్లని నీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్లు వాడాలి.
  2. బొప్పాయి పండు ముక్కలను గుజ్జుగా  చేసి  అందులో ఒక నిమ్మ చెక్క పిండి పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే చలికాలంలో స్కిన్‌ తాజాగా, మెరుస్తూ ఉంటుంది.
  3. ఈ సీజన్‌లో కూడా బయటకు వెళ్లే ముందు చర్మానికి సన్‌స్ర్కీన్‌ రాసుకోవాలి.
  4. చర్మాన్ని రోజులో ఎన్నిసార్లు మాయిశ్చరైజ్‌ చేసుకుంటే అంత మంచిది.
  5. చలికాలంలో పెదవులు పొడిబారిపోతుంటాయి.  వాటిపై చర్మం పగులుతుంది. లిప్‌బామ్‌ లేదా నెయ్యి రాసుకుంటే పెదవులు మృదువుగా మారతాయి. 
  6. ఈ సీజన్‌లో పదే పదే మృతకణాలను తొలగించవద్దు.
  7. తక్కువ సమయంలో స్నానం ముగించడం వల్ల కూడా చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు. 

Updated Date - 2020-12-26T05:52:16+05:30 IST