చుండ్రు పోవాలంటే..!
ABN , First Publish Date - 2021-04-21T05:30:00+05:30 IST
చుండ్రు చిన్న సమస్యగానే కనిపిస్తుంది. కానీ దాన్ని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసి విఫలమవుతున్న వారిని చూస్తూనే ఉంటాం. అయితే షాంపూల అవసరం లేకుండా చుండ్రును దూరం చేసేందుకు కొన్ని చిట్కాలున్నాయి. అవేమిటంటే...

- వారంలో రెండు రోజులు తలకు ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయాలి. ఆలివ్ ఆయిల్లో సహజసిద్ధంగా చుండ్రును తొలగించే గుణాలున్నాయి.
- నిమ్మ ఆకులను అరగంట పాటు నీళ్లలో మరిగించాలి. తరువాత ఆ ఆకులను పేస్ట్ మాదిరిగా చేసి తలకు పట్టించాలి. నలభైనిమిషాల తరువాత శుభ్రంగా కడుక్కోవాలి.
- అలోవెరాలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇవి చుండ్రును సమర్ధవంతంగా తొలగిస్తాయి. తలకు అలోవెరా జెల్‌ను పట్టించి నలభై నిమిషాల తరువాత కడుక్కుంటే చుండ్రు సమస్య దూరమవుతుంది.
- మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ మాదిరిగా చేసుకుని తలకు పట్టించాలి. అరగంటపాటు అలా వదిలేసి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేయాలి.