బాత్‌రూంకు డోర్లు కూడా ఉండవ్.. కానీ ఇంటి ధర రూ. 6.5 కోట్లు

ABN , First Publish Date - 2021-03-08T05:51:16+05:30 IST

ఇల్లు గురించి మాట్లాడాలంటే ప్రైవసీ అనే దాని గురించి కూడా తప్పక మాట్లాడుకోవాల్సి ఉంటుంది.

బాత్‌రూంకు డోర్లు కూడా ఉండవ్.. కానీ ఇంటి ధర రూ. 6.5 కోట్లు

బోస్టన్: ఇల్లు గురించి మాట్లాడాలంటే ప్రైవసీ అనే దాని గురించి కూడా తప్పక మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఇల్లు కొనుక్కున్నారంటే బయట నుంచి ఎంత అందంగా కనపడుతుందో.. లోపల కూడా అంతే అందంగా కనిపించాలని అనుకుంటారు. అంతేకాదు ఎవరికి వారు తమ ప్రైవసీని కోరుకుంటారు. ప్రత్యేకంగా గదులను నిర్మించుకుంటారు. అయితే ఇంటిని, ఇంట్లోని గదులను అందంగా కట్టుకుని బాత్‌రూంలకు మాత్రం కనీసం డోర్‌లు కూడా పెట్టకపోతే ఎలా ఉంటుంది? ఇలాంటి ఇంటిని అసలు ఎవరైనా కొంటారా? 


అమెరికాలోని బోస్టన్‌లో ఇటువంటి ఇల్లు ప్రస్తుతం అమ్మకానికి వచ్చింది. పైగా ఈ ఇంటి ధర 9 లక్షల డాలర్లు(రూ. 6.58 కోట్లు). ఈ ఇంటిని బయటి నుంచి చూసిన వారంతా అబ్బో ఏముందని మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక్కసారి లోపలకు వెళ్లి అక్కడ కనిపించిన దృశ్యాలకు కంగుతింటున్నారు. మూడు అంతస్థుల భవనంలో నాలుగు బెడ్‌రూంలు, మూడు బాత్‌రూంలు ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. బాత్‌రూంలను లేటెస్ట్ డిజైనింగ్‌తో నిర్మించారు. కానీ, బాత్‌రూంలకు తలుపులను, గోడలను మాత్రం కట్టలేదు. మరి దీన్ని కొత్త స్టైల్ అనాలో లేక వేరే ఏదైనా అనాలో అర్థం కావడం లేదు. ఈ ఫొటోలను చూస్తున్న నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. బాత్‌రూంలకు కనీసం తలుపులు, గోడలు లేకపోతే ఈ ఇంటిని ఎవరు కొంటారంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Updated Date - 2021-03-08T05:51:16+05:30 IST