హోమియోతో కీళ్లనొప్పుల నుంచి విముక్తి

Jan 19 2021 @ 15:40PM

కాలు కదిపితే నొప్పి. వంగినా, కూర్చున్నా చెప్పలేనంత బాధ. ఎన్ని మందులు వాడినా, తాత్కాలిక ఉపశమనమే తప్ప పరిష్కారం మాత్రం శూన్యం. ఈ సమస్యకు శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమా? అంటే ఆ అవసరం లేకుండా ఆధునిక హోమియో చికిత్సతో నమ్మకమైన పరిష్కారం లభిస్తుందని అంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డా.మధువారణాశి.


ఇరవై, ముప్ఫై ఏళ్ల వయసులోనే కీళ్ల నొప్పులు కనిపిస్తున్నాయి. ఆర్థరైటిస్‌లో దాదాపు వందరకాలు కనిపిస్తాయి. ఈ సమస్య వయసు పెరిగిన కొద్దీ కీళ్లు అరిగిపోవడం వల్ల వస్తుంది. అధిక బరువు, శారీరక శ్రమ లోపం, హార్మోనల్‌ ఫ్యాక్టర్స్‌ వల్ల కీళ్లు త్వరగా అరుగుతాయి. కీళ్లు అరగడం ద్వారా వచ్చే ఈ వ్యాధిని ఆస్టియోఆర్థరైటిస్‌ లేదా డీజనరేటివ్‌ ఆర్థరైటిస్‌ అంటారు. కీళ్లలోపల సైనోవియల్‌ అనే పొర ఉండి దీని ద్వారా సైనోవియల్‌ ఫ్లూయిడ్‌ స్రవిస్తూ ఉంటుంది. దీనివల్ల ఎముకలపైన ఒత్తిడి పడకుండా జాయింట్‌ కదలడానికి తోడ్పడతాయి. పైకారణాల కారణంగా కార్టిలేజ్‌ అరగడం వల్ల, సైనోవియల్‌ ఫ్లూయిడ్‌ తగ్గడం వల్ల కీలు లోపల మెత్తగా తడిగా ఉండే పొరలు ఎండిపోయి ఎముకలు రెండూ ఒకదానితో ఒకటి ఒరుసుకుపోయి, ఆ భాగాన నొప్పి, వాపు ఏర్పడి కదలడానికి ఇబ్బంది పడుతుంది.


ఈ ఆర్థరైటిస్‌ అనేది ఏ జాయింట్‌కు అయినా రావడానికి ఆస్కారం ఉంటుంది. వయసును బట్టి, కారణాలను బట్టి శరీరంలో వివిధ భాగాలు ఆర్థరైటిస్‌కు గురికావడం జరుగుతుంది. వీటిలో ముఖ్యమైనవి ఆస్టియోఆర్థరైటిస్‌, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, సెర్వికల్‌ స్పాండిలోసిస్‌, లుంబార్‌ స్పాండిలోసిస్‌, ఆస్టియోపోరోసిస్‌, గౌట్‌, సొరియాటిక్‌ ఆర్థరైటిస్‌.


కారణాలు

మనిషిని కుంగదీసే నొప్పితో ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చే స్థితి ఆస్టియో ఆర్థరైటిస్‌.


వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది.

అధిక బరువు, అధిక శారీరకశ్రమ, సరియైున వ్యాయామం లేకపోవడం, వయసు మీరిపోవడం, అధికంగా జాగింగ్‌ చేయడం, ఎక్కువగా మెట్లు ఎక్కడం, పోషకాహార లోపం, కాల్షియంలోపం, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, జీవక్రియలోపం, రసాయనాల సమతుల్యత లేకపోవడం, హార్మోన్ల ప్రభావం, రోగనిరోధక శక్తి తగ్గడం, కొన్ని రకాల గాయాల వల్ల ఆర్థరైటిస్‌ సమస్య మొదలవుతుంది.


లక్షణాలు

మోకాలు కదిలినప్పుడల్లా కొంచెం నొప్పి పుడుతుంది. క్రమేణా అది ఎక్కువై నడవలేని స్థితి వస్తుంది. ముఖ్యంగా మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఉదయం నిద్రలేవగానే మోకాలులోని జాయింటు బిగుసుకుపోయినట్లుగా ఉండి నడవడం కష్టమవుతుంది. కాసేపు నడిచిన తరువాత కాస్త ఉపశమనం కలుగుతుంది. సాధారణంగా ఉదయం పూట తక్కువగా ఉండి సాయంత్రం ఎక్కువవుతాయి. వ్యాయామం చేస్తున్నప్పుడు మోకాలులో నొప్పి మొదలవుతుంది. కీళ్లలో లిగమెంట్స్‌ బలహీనమైనప్పుడు మోకాళ్లలో నొప్పి, వాపు వస్తుందది స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.


వ్యాధి నిర్ధారణ

జాయింటు ఎక్స్‌రే, ఎమ్‌ఆర్‌ఐ, ఆర్థోస్కోపీ, కాల్షియం, ఆర్‌ఏ ఫ్యాక్టర్‌, సీరమ్‌ యూరియా ఆసిడ్‌ వంటి పరీక్షలు వ్యాధి నిర్ధారణలో ఉపయోగపడతాయి.


హోమియో చికిత్స

మోకాళ్లు, జాయింటు నొప్పులకు హోమియో చికిత్స ద్వారా అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది. శస్త్రచికిత్స అవసరమనుకున్న చాలా కేసులలో ఈ చికిత్స మెరుగైన జీవితాన్ని అందించగలుగుతుంది. నొప్పికి వాడే మాత్రలు తాత్కాలిక ఉపశమనం కలిగించినా తిరిగి మరింత బాధపెడతాయి. కీలుమార్పిడి శస్త్రచికిత్స కొంతమందిలో ప్రయోజనం ఉన్నా, చాలా మందికి హోమియో చికిత్సతో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. సరియైున వైద్యుని ఎంపికతో సరియైున చికిత్స తీసుకుంటే జీవితాన్ని మరింత సుఖమయం చేసుకోవచ్చు.


డా. మధు వారణాశి

MD, MS(PSYCHO), MCSEP

ప్రముఖ హోమియో వైద్యులు

ప్లాట్‌నెం 188, వివేకానందనగర్‌ కాలనీ

కూకట్‌పల్లి, హైదరాబాద్‌

ఫోన్‌ : 8897331110, 8886509509Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.