USA: నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు.. పోలీసులకు చిక్కాక యువకుడు అన్న మాటలివి.. వైరల్ అవుతున్న కథనం.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-09-04T00:39:32+05:30 IST

చట్టాన్ని ఉల్లంఘించి పోలీసులు చిక్కిన అనేక మంది మొదటగా చెప్పేమాట.. నేనే తప్పూ చేయలేదని. ఆ తరువాత..పోలీసులను పక్కదోవ పట్టించేందుకు వారు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. అధికారుల సమాయాన్ని వ్యర్థం చేస్తారు. కానీ.. అమెరికాలోని ఓ యువకుడు మాత్రం

USA: నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు.. పోలీసులకు చిక్కాక యువకుడు అన్న మాటలివి.. వైరల్ అవుతున్న కథనం.. అసలేం జరిగిందంటే..

ఎన్నారై డెస్క్: చట్టాన్ని ఉల్లంఘించి పోలీసులు చిక్కిన అనేక మంది మొదటగా చెప్పేమాట.. నేనే తప్పూ చేయలేదని. ఆ తరువాత..పోలీసులను పక్కదోవ పట్టించేందుకు వారు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. అధికారుల సమాయాన్ని వ్యర్థం చేస్తారు. కానీ.. అమెరికాలోని ఓ యువకుడు మాత్రం అలా చేయలేదు. పోలీసులకు చిక్కగానే తాను తప్పు చేశానంటూ వెంటనే ఒప్పేసుకున్నాడు. అంతేకాకుండా.. తనకు అబద్ధం చేప్పే ఉద్దేశం అసలే లేదంటూ ఓ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ఫ్లోరిడాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. 


జోసెఫ్ బెక్(27) అనే యువకుడు ఇటీవల ఓ రోజు రాత్రి మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ తన కారును రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌కు ఢీకొట్టాడు. ఇదంతా అక్కడే ఉన్న పోలీసుల కంట పడింది. వాస్తవానికి ఆ రోడ్డులో వాహనాలు గరిష్టంగా గంటకు 35 మైళ్ల వేగానికి మించి వెళ్లకూడదు. కానీ.. జోసెఫ్ మాత్రం తన కారును ఏకంగా 47 మైళ్ల వేగంతో తోలుతూ డివైడర్‌ను ఢీకొట్టాడు. అక్కడ ఉన్న పోలీసులు కారును సమీపించగా.. అతడు ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. దీంతో.. పోలీసులు అతడిని స్టేషన్‌కు తరలించారు. మద్యం సేవించాడో లేదో తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో అతడి బండారం బయటపడింది. అతడి శ్వాసలో మద్యం శాతం దాదాపు 0.282గా ఉన్నట్టు తేలింది. సాధారణ స్థాయికంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. దీంతో.. వారు జోసెఫ్‌పై డ్రంకెన్ డ్రైవింగ్ కేసు నమోదు చేశారు.  

Updated Date - 2022-09-04T00:39:32+05:30 IST