ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

ABN , First Publish Date - 2022-05-17T06:44:34+05:30 IST

కుక్కునూరు కొత్తచెరువులో సోమవారం ఉదయం ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడిచేశాయి.

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

చెరువులో పనిచేస్తున్న 600 మంది..  60 మందికి గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స

కుక్కునూరు, మే 16 : కుక్కునూరు కొత్తచెరువులో సోమవారం ఉదయం ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడిచేశాయి. ఆసమయంలో దాదాపు 600 మందికి పైగా కూలీలు పనిచేస్తున్నారు. చెరువులో మట్టితె చ్చి గట్టుపై కొందరు పోస్తుండగా మరికొందరు చెరువు కట్టపై ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ఆ సమయంలో చెట్టుకొమ్మమధ్య ఉన్న తేనెపట్టు కదిలి ఒక్కసారిగా తేనెటీగలు పైకి లేచాయి. పనిచేస్తున్న కూలీలను చుట్టిముట్టి దాడిచేయడంతో వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో దాదాపు 60 మందికిపైగా కూలీలు తేనెటీగల బారినపడ్డా రు. వారిని ద్విచక్రవాహనాలు, ఆటోల పైన కుక్కునూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిచారు. తేనెటీగల దాడిలో పలువురికి ముఖం, చేతులు వీపు మెడ భాగాలు వాచిపోయాయి. మరికొందరు తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సొమ్మసిల్లి పడిపోయారు. 50 మందికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి వెళ్ళిపోగా మిగిలిన పదిమందికి ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. ఎవరికైనా ప్రాణాపాయం ఉంటే వెంటనే జంగారెడ్డిగూడెం తరలించాలని, మెరుగైన వైద్యం అందించాలని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆదేశించారు. ఎవరికి ప్రాణాపాయం లేదని వైద్యుడు శ్రీనివాస్‌ తెలిపారు. 

Updated Date - 2022-05-17T06:44:34+05:30 IST