ఒమైక్రాన్ ఎఫెక్ట్.. భారత్‌తోపాటు మరో ఏడు దేశాల విషయంలో హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-01-05T21:58:11+05:30 IST

దక్షిణ ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్.. ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కరోజులోనే సుమారు 10లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా హాంగ్ కాంగ్‌లో కూడా ఈ వే

ఒమైక్రాన్ ఎఫెక్ట్.. భారత్‌తోపాటు మరో ఏడు దేశాల విషయంలో హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం

ఎన్నారై డెస్క్: దక్షిణ ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్.. ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కరోజులోనే సుమారు 10లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా హాంగ్ కాంగ్‌లో కూడా ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 8 దేశాల విమానాలపై హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది దేశాల విమానాలపై నిషేధం విధించింది. ఈ దేశాల జాబితాలో యూకే, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా,పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్ సహా ఇండియా కూడా ఉంది. అంతేకాకుండా ఆ దేశ ప్రజలకు కూడా హాంగ్ కాంగ్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. శుక్రవారం నుంచి సాయంత్రం 6 తర్వాత ఇండోర్ డైనింగ్‌పై నిషేధం అమల్లోకి వస్తుందని చెప్పింది. స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ సెంటర్లు, బార్లు, క్లబ్బులు, మ్యూజియంలు మూతపడతాయని వెల్లడించింది. 




Updated Date - 2022-01-05T21:58:11+05:30 IST