ఆ తొమ్మిది దేశాల విషయంలో హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-03-21T18:39:29+05:30 IST

కొవిడ్ ఉధృతి తగ్గిన నేపథ్యంలో హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్, బ్రిటన్ సహా తొమ్మిది దేశాల అంతర్జాతీయ విమానాలపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ

ఆ తొమ్మిది దేశాల విషయంలో హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం

ఎన్నారై డెస్క్: కొవిడ్ ఉధృతి తగ్గిన నేపథ్యంలో హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్, బ్రిటన్ సహా తొమ్మిది దేశాల అంతర్జాతీయ విమానాలపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు హాంగ్ కాంగ్ సిటీ లీడర్ క్యారీ ల్యామ్ ఓ ప్రకనటలో తెలిపారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కొవిడ్ విజృంభణ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, భారత్ సహా ఎనిమిది దేశాల విమానాలపై నిషేధం విధిస్తూ జనవరిలో ప్రకటన విడుదల చేసింది. ఈ జాబితాలో నేపాల్‌ను కూడా చేర్చుతూ ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం మహమ్మారి ఉధృతి తగ్గిన నేపథ్యంలో హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది దేశాల అంతర్జాతీయ విమానాలపై విధించిన నిషేధాన్ని ఏప్రిల్‌లో ఎత్తేయాలనే నిర్ణయానికి వచ్చింది. 




Updated Date - 2022-03-21T18:39:29+05:30 IST