విద్య, సేవా రంగాల్లో గౌరవ డాక్టరేట్లు

ABN , First Publish Date - 2022-08-08T05:26:56+05:30 IST

విద్య, సామాజిక సేవా రంగాల్లో అందిస్తున్న సేవలకుగాను పీలేరు కు చెందిన ఇద్దరికి గౌరవ డాక్టరేట్లు లభించా యి.

విద్య, సేవా రంగాల్లో గౌరవ డాక్టరేట్లు
గౌరవ డాక్టరేట్‌ అందుకున్న పోతంశెట్టి రమేశ్‌,

పీలేరు, ఆగస్టు 7: విద్య, సామాజిక సేవా రంగాల్లో  అందిస్తున్న సేవలకుగాను పీలేరు కు చెందిన ఇద్దరికి గౌరవ డాక్టరేట్లు లభించా యి. విద్యారంగ అభివృద్ధికి చేస్తున్న కృషికి గాను పీలేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపా ధ్యాయుడిగా పని చేస్తున్న పోతంశెట్టి రమేశ్‌ కు, సామాజిక రంగంలో సేవ చేస్తున్న విశ్రాం త ఉపాధ్యాయుడు వి.రామచంద్రకు పాండి చ్చేరికి చెందిన గ్లోబల్‌ హ్యూమన్‌ పీస్‌ యూ నివర్శిటీ వారు గౌరవ డాక్టరేట్లు అందించా రు. పీలేరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయు డిగా పనిచేస్తున్న పోతంశెట్టి రమేశ్‌ ఉపాధ్యాయుడిగా, రిసోర్స్‌ పర్సన్‌గా, ఎస్‌టీయూ సంఘ నాయకుడిగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఫ్యాప్టో అధ్యక్షుడిగా దాదాపు 27 సంవత్సరాలు అందించిన సేవలను పరిగణలోకి తీసు కున్న యూనివర్శిటీ వర్గాలు ఆయనకు డాక్టరేట్‌ అందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయు డిగా సేవలందించిన రామ చంద్ర హెచ్‌ఎంగా పదవీ విరమణ అనంతరం విశ్రాంతి తీసుకోకుండా పీలేరు పట్టణంలో ‘మానవత’ సంస్థను ఏర్పాటు చేసి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా సమయంలో ఆయన అందించిన సేవలను గుర్తించి యూని వర్శిటీ అధికారులు ఆయనకు డాక్టరేటు ప్రదానం చేశా రు. పాండిచ్చేరిలో శనివారం జరిగిన యూనివర్శిటీ స్నాతకోత్సవంలో యూనివర్శిటీ వీసీ డాక్టర్‌ పి.మ్యాన్యుయల్‌, పాంచిచ్చేరి స్పీకర్‌ ఆర్‌.సెల్వం చేతుల మీదుగా వారిద్దరూ డాక్టరేట్లను అందుకున్నారు. డాక్టరేట్లు అందుకున్న వీరిద్దరినీ పీలేరులోని పలువురు ఉపాధ్యాయులు అభినందిం చారు. 





Updated Date - 2022-08-08T05:26:56+05:30 IST