సీఆర్టీలలో చిగురిస్తున్న ఆశలు!

ABN , First Publish Date - 2022-05-06T06:49:49+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో అనాధిగా పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్సి టీచర్లలో(సీఆర్టీ) ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించినట్లుగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని

సీఆర్టీలలో చిగురిస్తున్న ఆశలు!
సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చిన సీఆర్టీలు

కమిషనర్‌ ఆదేశాలపై అధికారుల కసరత్తు

ఉట్నూర్‌, మే 5: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో అనాధిగా పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్సి టీచర్లలో(సీఆర్టీ) ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించినట్లుగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ ఉట్నూర్‌ ఐటీడీఏ పరిధిలో పని చేస్తున్న సీఆర్టీల సర్టిఫికెట్లను పరిశీలించి నివేదికలు పంపాలని ఆదేశించడంతో ఉట్నూర్‌ ఐటీ డీఏ ప్రాజెక్టు అధికారి  ఆదేశాల మేరకు గురువారం స్థానిక కుమరంభీం ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాలోని సీఆర్టీల సర్టిఫికెట్లను పరిశీలించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 

ఉమ్మడి జిల్లాలో 133 ఆశ్రమ పాఠశాలు 

గిరిజన విద్యారంగాన్ని తీర్చి దిద్దడానికి స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకోని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని 133 ఆశ్రమ  పాఠశాలల్లో 1059 మంది సీఆర్టీలు పని చేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 429 మంది, కుమ్రం భీం జిల్లాలో 371, నిర్మల్‌ జిల్లాలో 155, మంచిర్యాల జిల్లాలో 105 మంది సీఆర్టీలు పని చేస్తున్నారు. 

2014 ముందు పని చేసిన వారివే పరిశీలన

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు 2 జూన్‌ 2014   కంటే ముందు పని చేసిన 568 మంది సీఆర్టీల సర్టిఫికెట్లను మాత్రమే పరిశీలించాలని ఆదేశించడంతో ఉమ్మడి  జిల్లా అధికారులు డీడీ సంధ్యారాణీ కన్వీనర్‌ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌ డిడి మనమ్మ, మంచిర్యాల డీటీడీవో జనార్ధన్‌, ఎసీఎంవో జగన్‌, బీఎడ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మెస్రం మనోహర్‌, జిల్లా క్రీడల అధికారి కోరేడి పార్థసారది, జీసీడీవో ఛాయ, పిజీ హెచ్‌ఎం ప్రేంసింగ్‌, చందన్‌, ఏటీడీవోలు ఆత్రం భాస్కర్‌, క్రాంతిల ఆధ్వ ర్యంలో జిల్లాల వారిగా టేబుల్‌లను ఏర్పాటు చేసి 568 మంది సీఆర్టీల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గోపాల్‌నాయక్‌, వేణుమాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.


కటాఫ్‌ డేట్‌ లేకుండా  సీఆర్టీలందరినీ క్రమబద్ధీకరించాలి 

ఉట్నూర్‌, మే 5: ఉమ్మడి జిల్లాలోని ఐటీడీఏ ఆశ్రమ పాఠశాల ల్లో పని చేస్తున్న సీఆర్టీలందరిని కటాప్‌ డేట్‌తో సంబందం లేకుండా క్రమబద్ధీకరించాలని టీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాథోడ్‌ గణేష్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఉట్నూర్‌ ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో ఉమ్మడి జిల్లా నుంచి తరలి వచ్చిన సీ ఆర్టీలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం ప్రకటించిన విధంగా సీఆర్టీలందరినీ క్రమబద్ధీకరించాలని గిరిజన సంక్షేమ అధికారులు కేవలం 2014ముందు నియామకమైన సీఆర్టీల సర్టిఫికెట్లు మాత్ర మే పరిశీలించడంతో జిల్లాలోని మిగితా సీఆర్టీలు నిరాశకు గుర వుతున్నారన్నారు. సీఆర్టీలలో ఎంతో ప్రతిభ ఉన్న ఉపాధ్యాయు లు గిరిజన విద్యార్థులకు సేవలు అందిస్తున్నారన్నారు. ఇందులో   నాయకులు పవన్‌, తదితరులు పాల్గొని అనంతరం ఐటీడీఏ పీవో అంకిత్‌కు వినతిపత్రం అందజేశారు. 

Read more