సోయాపై ఆశలు గల్లంతు!

ABN , First Publish Date - 2021-10-17T06:32:17+05:30 IST

ఆరుగాలం కష్టపడి పండించిన సోయా పంట ఆశలు గల్లంతవుతున్నాయి. వర్షాలతో అన్నదాతలు ఆ దరబాదరగా అమ్మేసుకుంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏ డాది పంటకు మద్దతు ధరకు మించిన పలుకడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తూ అమ్మేసుకుంటున్నారు. ఈ ఏడాది సోయా మద్దతు ధర రూ.3950 ఉండగా ప్రస్థుతం బయట మార్కెట్‌లో రూ.4500 నుంచి రూ. 5500 వరకు పలుకుతుంది.

సోయాపై ఆశలు గల్లంతు!
తడిసిన సోయా

అన్నదాతను వెంటాడుతున్న అకాల వర్షాలు
పంటను అమ్ముకునేందుకు పడరాని పాట్లు
నాణ్యత, తేమ శాతం పేరిట ధరలో కోతలు
గ్రామాల్లో మొదలైన దళారుల దందా

ఆదిలాబాద్‌, అక్టోబరు16 (ఆంధ్రజ్యోతి) : ఆరుగాలం కష్టపడి పండించిన సోయా పంట ఆశలు గల్లంతవుతున్నాయి. వర్షాలతో అన్నదాతలు ఆ దరబాదరగా అమ్మేసుకుంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏ డాది పంటకు మద్దతు ధరకు మించిన పలుకడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తూ అమ్మేసుకుంటున్నారు. ఈ ఏడాది సోయా మద్దతు ధర రూ.3950 ఉండగా ప్రస్థుతం బయట మార్కెట్‌లో రూ.4500 నుంచి రూ. 5500 వరకు పలుకుతుంది.
జిల్లాలో లక్ష ఎకరాలలో..
జిల్లాలో లక్ష ఎకరాలలో సోయా పంటసాగైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఎకరాన 6 నుంచి 7 క్వింటాళ్ల పంట దిగుబడులు చేతికొస్తున్నాయి. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 7 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయని మార్కెటింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. పక్షం రోజుల నుంచే పంట చేతికి రావడంతో రైతులు పంట నూర్పిడి ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టాయని వాతావరణ శాఖ నిపుణులు ప్రకటించిన గత రాత్రి నుంచి జిల్లావ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమగమవుతున్నారు.
వ్యాపారుల ఇష్టారాజ్యం..
తడిసిన పంటను వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. నాణ్యతగా లేదంటూ దళారులు కొర్రీలు పెడుతున్నారు. జిల్లాలో సోయా పంటను కొనుగోలు చేస్తున్న వ్యాపారులంతా కుమ్మకై ధర నిర్ణయిస్తున్నారు. నాణ్యతను బట్టి రూ.4500 నుంచి రూ.5500 వ రకు కొనుగోలు చేస్తున్నారు. నాణ్యతను సాకుగా చూపుతూ ధరలో కోతను విధిస్తున్నారు. నిన్న మొ న్నటి వరకు 5వేలకు పైగా ధర పలికిన సోయలు శనివారం రూ.4600 ధర పలికింది. కొన్ని గ్రామాల్లోనైతే క్వింటాలు రూ.4వేలకే కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత, తూకంలో కోత పెడుతూ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్య వహరిస్తున్నారు. పంట డబ్బులను నగదుగా చెల్లిస్తున్నామంటూ కోతలు విధిస్తున్నారు. ప్రస్థుతం ఏ గ్రామంలో చూసిన దళారుల దందానే కనిపిస్తుంది. రైతులు తమ అత్యవసరాల పేరిట పంటను అమ్మేసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో ఇంత జరుగుతున్న మార్కెటింగ్‌ అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదు. చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
అమ్ముకోవాలన్నా అవస్థలే..
పంటను పండించడం ఒకవంతైతే చేతికి వచ్చిన పంటను అమ్ముకోవాలన్న అన్నదాతలు అవస్థలే పడాల్సి వస్తుంది. వర్షాలకు పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో రోడ్లు, ఖాళీ స్థలాల్లో పంటను ఆరబెడుతూ రాత్రి పగలు పంట కుప్పల వద్దనే కాపల కాస్తున్నారు. గత రాత్రి కురిసిన వ ర్షానికి పంట తడవడంతో నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుందని అన్నదాతలు వాపోతున్నారు. వర్షాలతో పంటలను అమ్ముకోవాలన్నా పాట్లు పడాల్సి వస్తుందని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
శ్రీనివాస్‌ (జిల్లా మార్కెటింగ్‌ అధికారి, ఆదిలాబాద్‌)

పంట కొనుగోళ్లలో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహ రిస్తే చర్యలు తప్పవు. పంట నాణ్యతను బట్టి ధర చెల్లించాలి. తూకం, తేమలో కోత పెడితే రై తులు ఫిర్యాదు చే యాలి. ప్రభుత్వ మద్దతు ధర కం టే బయట మార్కెట్‌లోనే ఎక్కువ ధర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలే దు.

Updated Date - 2021-10-17T06:32:17+05:30 IST