ఉద్యాన రైతు ఉసూరు.. అమలుకు నోచని తోటల పథకాలు

ABN , First Publish Date - 2020-08-08T15:12:02+05:30 IST

కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయకపోవడంతో సరిగ్గా ఏడాదిన్నర నుంచి రాయితీ పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో తమకు ప్రయోజనాలేవీ అందడం లేదని రైతులు వాపోతున్నారు.

ఉద్యాన రైతు ఉసూరు.. అమలుకు నోచని తోటల పథకాలు

కేంద్రం నిధులిచ్చినా.. రాష్ట్రం నిర్లిప్తత

వాటా విడుదల చేయని వైసీపీ ప్రభుత్వం

ఉద్యానవనశాఖకు వెయ్యి కోట్లు పెండింగ్‌ 

రైతులకు అందని రాయితీలు 


(అమరావతి - ఆంధ్రజ్యోతి): కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయకపోవడంతో సరిగ్గా ఏడాదిన్నర నుంచి రాయితీ పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో తమకు ప్రయోజనాలేవీ అందడం లేదని  రైతులు వాపోతున్నారు. ఉద్యానవన శాఖ లో కేంద్ర ప్రభుత్వ పథకాలే అధికం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమ కూరుస్తాయి. గతేడాది ఖర్చు చేసిన పథకాలకు రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడం తో ఈ ఏడాది ఇంత వరకు ఆ పథకాలేవీ రైతులకు అం దించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంటు విడుదల చేయకపోవడంతో కేంద్ర పథకాలకూ గ్రహణం పట్టింది. నిరుటి బిల్లులే పెండింగ్‌లో ఉండడంతో ఈ ఏడాది కూడా రాష్ట్ర వాటా విడుదల ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అవకాశ మున్న పథకాలను కేంద్రం వాటా సొమ్ముతోనే అధికారులు అమలు చేస్తున్నారు.  రాష్ట్ర ప్రభు త్వం తన వాటా విడుదల చేయడం లేదని చెప్తు న్నారు. 


2019-20లో మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెకుకు రూ.800 కోట్లు, ఎంఐడీహెచ్‌(సమగ్ర ఉద్యానవ నాల అభివృద్ధి పథకం)కురూ.90 కోట్లు, ఆర్‌కేవీవె ౖ(రాష్ర్టీయ కృషి వికాస్‌ యోజన)కు  రూ.50 కోట్లు, ఆయిల్‌పామ్‌కు రూ.20 కోట్లు, కొబ్బరి అభివృద్ధికి రూ.20 కోట్లు ఉద్యానవనశాఖకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని సమా చారం. కేంద్రం నుంచి మైక్రో ఇరిగేషన్‌కు రూ.452 కోట్లు, ఎంఐడీహెచ్‌కు రూ.114 కోట్లు, ఆర్‌కేవీవై కు రూ.34 కోట్లు, ఆయిల్‌పామ్‌కు రూ.25 కోట్లు, కొబ్బరి బోర్డు నుంచి రూ.20 కోట్లు మంజూర య్యాయి. 


కేంద్రం నిధులకు యూసీలు, ప్రొగ్రెస్‌ రిపోర్టులు పంపితే.. కేంద్రం రెండు దఫాలుగా నిధులను విడుదల చేస్తుంది. మొదటి విడత సొమ్ము ఖర్చు చేస్తేనే రెండో దఫా నిధులిస్తుంది. 2019-20కి సంబంధించి వివరాలన్నీ కేంద్రానికి పంపారు. దీంతో ఎంఐడీహెచ్‌, ఆయిల్‌పామ్‌ పథకాలకు ఈ ఏడాది కేంద్రం తొలి విడత నిధులు విడుదల చేసింది. ఆర్‌కేవీవై, కోకో నట్‌ బోర్డు, మైక్రో ఇరిగేషన్‌ పథకాలకు నిధులు పెండింగ్‌లోనే ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని కూడా రాష్ట్రప్రభుత్వం ఉద్యానవనశాఖకు విడుదల చేయలేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధులూ పీడీ అకౌంట్లలో మూలుగుతున్నాయి. గతేడాది ఆయా పథకాలకు 100ు నిధులు ఖర్చు చేస్తేనే కేంద్రం మళ్లీ నిధులిస్తుంది. లేకపోతే నిధులు రావు. నిరుడు ఖర్చు చేసిన సొమ్ముకుబిల్లులు ఏవీ పాస్‌ కావ డం లేదని అధికారులు చెప్తున్నారు. అలాగే, రాష్ట్రాభివృద్ధి పథకం కింద ఏటా ఇచ్చే రూ.100 కోట్లు కూడా విడుదల  చేయలేదు.  


డ్రిప్‌..డ్రాప్‌

ఉద్యానవనశాఖలో డ్రిప్‌ ఇరిగేషన్‌ను ఆపే శారు. నిధులు విడుదల కాక పథకం నిలిచి పోయింది. ఫర్‌ డ్రాప్‌-మోర్‌ క్రాప్‌(చుక్క నీటితో ఎంతో పంట) అనే నినాదంతో కేంద్రం సూక్ష్మ సేద్య పథకాన్ని ప్రధానమంత్రి కృషి సించాయ్‌ యోజన కింద నిధులిస్తూ ప్రోత్సహిస్తోంది. గత ప్రభుత్వం సూక్ష్మసేద్య పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. ముఖ్యంగా వర్షాభావ ప్రాంతా ల్లో ఈ పథకాన్ని ప్రోత్సహించింది. రాయలసీమ, ఉత్తరాంధ్రతోపాటు ప్రకాశం జిల్లాలో లక్షలాది ఎకరాలను సాగులోకి తెచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తోందని రైతులు ఆరోపి స్తున్నారు.  గతేడాది 2.40 లక్షల హెక్టార్ల లక్ష్యానికిగాను 2.89 లక్షల హెక్టార్ల సాగుకు 248 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు. కానీ అమలైంది 51ు మాత్రమే. నిరుడు అనంతపురం లో 29 వేలు, కడప 21 వేలు, చిత్తూరు, కర్నూలు ల్లో 14 వేలు చొప్పున, ప్రకాశంలో 11వేలు, పశ్చిమగోదావరి 9వేల హెక్టార్లు, మిగిలిన అన్ని జిల్లాలకు కలిపి 24 వేల హెక్టార్లలో సూక్ష్మసేద్య పరికరాలిచ్చారు. ఈ ఏడాది 2 లక్షల హెక్టార్లలో సూక్ష్మసేద్యం అమలుకు ఉద్యానవనశాఖ ప్రతి పాదించింది. డ్రిప్‌, స్పింక్లర్ల కోసం 1.75 లక్షల మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. 


కానీ, ప్రభుత్వం ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. దీంతో లక్ష్య సాధన జీరో అయింది. ఏటా వేసవిలోనే డ్రిప్‌, స్పింక్లర్లను సిద్ధం చేయా లి. నిధులు రాక ఇంత వరకు ఏ రైతుకూ సూక్ష్మ సేద్య పరికరాలు అందించలేదు. 


పాత బిల్లులు చెల్లిస్తేనే..

ఏపీలో 35 డ్రిప్‌ ఇరిగేషన్‌ కంపెనీలు రిజిస్టర్‌ అయ్యాయి. పరికరాలు సరఫరా చేసిన ఈ కంపెనీల కు సొమ్ము చెల్లించలేదు. దీంతో పాత బిల్లులు ఇవ్వకుండా రాయితీ పరికరాలు ఇచ్చేందుకు ఆ కంపెనీలు ముందుకు రావడం లేదు. 2019-20లో 1.22 లక్షల హెక్టార్లు, 2018-19లో 2లక్షల హెక్టార్లు, 2017-18లో 1.41 లక్షల హెక్టార్లు, 2016-17లో 95వేల హెక్టార్లు, 2015-16లో 35వేల హెక్టార్లలో సూక్ష్మసేద్యం అమలు చేశారు. 2020-21కి కేంద్రం ఇవ్వాల్సిన రూ.450 కోట్లలో రూ.100 కోట్లు ఇటీవలే విడుదల చేసింది. రాష్ట్రవాటా రూపాయి కూడా విడుదల కాలేదు. దీంతో ఈ ఏడాది డ్రిప్‌, స్పింక్లర్ల కోసం రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. 

Updated Date - 2020-08-08T15:12:02+05:30 IST