ఒమైక్రాన్ ఎఫెక్ట్: ఆస్పత్రి పాలవుతున్న ఐదేళ్లలోపు చిన్నారులు..!

ABN , First Publish Date - 2022-01-09T03:21:11+05:30 IST

అమెరికాలో ఒమైక్రాన్ వేగంగా వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా.. అమెరికాలో ఐదేళ్ల లోపున్న పిల్లలను అనేక మంది కరోనా సోకి ఆస్పత్రి పాలవుతున్నారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.

ఒమైక్రాన్ ఎఫెక్ట్: ఆస్పత్రి పాలవుతున్న ఐదేళ్లలోపు చిన్నారులు..!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఒమైక్రాన్ వేగంగా వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా.. అమెరికాలో ఐదేళ్ల లోపున్న పిల్లలను అనేక మంది కరోనా సోకి ఆస్పత్రి పాలవుతున్నారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.  మిగతా అన్ని వయసుల వారికీ కరోనా టీకాలు ఇస్తున్నప్పటికీ.. ఐదేళ్లలోపు వారికి ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో.. ప్రస్తుత పరిస్తితి ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. అమెరికా అంటువ్యాధుల నిరోధక సంస్థ నివేదక ప్రకారం..డిసెంబర్‌లో ఒమైక్రాన్ వ్యాప్తి ప్రారంభమైన కొత్తలో సగటున ప్రతి లక్ష మందిలో  ఐదేళ్ల లోపు వారు ఇద్దరు ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఈ సంఖ్య ఐదును దాటింది. అయితే.. 5 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న  ప్రతి లక్ష  మందిలో ఒక్కరు ఆస్పత్రి పాలవుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. చిన్నారులను కరోనా నుంచి కాపాడుకునేందుకు టీనేజర్లు, పెద్దలు టీకాలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తుత పరిస్థితులు గుర్తు చేస్తున్నాయని సీడీసీ డైరెక్టర్ డా. రొషేల్ వేలస్కీ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-09T03:21:11+05:30 IST