ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లేకున్నా ఆస్పత్రులు అడ్మిషన్ ఇవ్వాలి: హైకోర్టు

ABN , First Publish Date - 2021-04-23T23:15:24+05:30 IST

ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లేకున్నా ఆస్పత్రులు అడ్మిషన్ ఇవ్వాలి: హైకోర్టు

ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లేకున్నా ఆస్పత్రులు అడ్మిషన్ ఇవ్వాలి: హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. కోవిడ్ లక్షణాలు ఆధారంగా చేసుకుని ఆస్పత్రిలో చేర్చుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు రోజుకు 30 నుంచి 40 వేల టెస్టులు చేస్తున్నామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి  ఇప్పటి వరకు 3 లక్షలు 47 వేలు మాత్రమే టెస్టులు చేశారని, అలా అయితే 8 లక్షల 40 వేలు చేయాలని, ఎందుకు చేయడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లేకున్నా ప్రతి ఆస్పత్రి అడ్మిషన్ ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా కేసులు వివరాలను ప్రతి రోజు మీడియా బులిటెన్ విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. యాదాద్రి భువనగిరి, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో చాలా కేసులు నమోదు అవుతున్నాయని, కాబట్టి ఈ ప్రాంతాల్లో టెస్టులు పెంచాలని హైకోర్టు వెల్లడించింది. వలస కార్మికులు ఇబ్బందులు పడకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు తెలిపింది. 

Updated Date - 2021-04-23T23:15:24+05:30 IST