హాస్టళ్లలో వసతులు కల్పించాలి

ABN , First Publish Date - 2021-01-22T03:58:11+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చేనెలలో ప్రారంభమయ్యే కళాశాలలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు సరిపడు అన్నీ వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కృష్ణమాచారి కోరారు

హాస్టళ్లలో వసతులు కల్పించాలి

నారాయణపేట, జనవరి 21 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చేనెలలో ప్రారంభమయ్యే కళాశాలలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు సరిపడు అన్నీ వసతులు ఏర్పాటు చేయాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కృష్ణమాచారి కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో జిల్లాలోని వసతిగృహ సంక్షేమ అధికారులు, సిబ్బందితో సమావేశమై ఆయన మాట్లాడారు. వసతి గృహాల్లో పరిసరాలను, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులు భౌతిక దూరంతో పాటు శానిటైజర్లు, మాస్కులు ధరించేలా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వసతి గృహాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో వసతిగృహ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-22T03:58:11+05:30 IST