అనుపమ పరమేశ్వరన్‌పై ‘హాట్ హాట్’ చర్చలు

Published: Thu, 20 Jan 2022 22:38:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అనుపమ పరమేశ్వరన్‌పై హాట్ హాట్ చర్చలు

మాలీవుడ్‌ నుంచి దిగుమతి అయిన అనుపమా పరమేశ్వరన్‌ 2016లో ధనుష్‌ హీరోగా నటించిన ‘కొడి’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమెకు తమిళంలో కంటే తెలుగులోనే వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో ఐదేళ్ళ విరామం తర్వాత 2021లో అధర్వ మురళి నటించిన ‘తళ్ళిపోగాదే’  చిత్రంలో నటించింది. అయితే, ఆమెకు కోలీవుడ్‌లో సినిమాల ద్వారా సంపాదించుకున్న క్రేజ్‌ కంటే.. సోషల్‌ మీడియా ద్వారా బాగా గుర్తింపు పొందింది. గ్లామర్‌, ఎక్స్‌పోజింగ్‌కు నో చెప్పే అనుపమ, ఇప్పుడు హఠాత్తుగా హద్దులు లేకుండా ఎక్స్‌పోజింగ్‌ చేయడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. 


తాజాగా ఆమె నటించిన తెలుగు చిత్రం(రౌడీ బాయ్స్)లో పూర్తిస్థాయి ఎక్స్‌పోజింగ్‌, లిప్‌లాక్‌తో అదరగొట్టేసింది. దీంతోపాటు పూర్తిస్థాయి గ్లామర్‌ రోల్‌లో కనిపించి అభిమానులను ఫిదా చేసింది. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇదే విధంగా ఎక్స్‌పోజింగ్‌ చేస్తే మాత్రం వరుస అవకాశాలతో అనుపమ ఫుల్‌బిజీ కావడం ఖాయమని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International