హోరాహోరీగా ఖోఖో పోటీలు

ABN , First Publish Date - 2022-09-25T05:12:28+05:30 IST

నవోదయ విద్యాలయంలో సౌత్‌ ఇండియా ఖోఖో రీజనల్‌ మీట్‌ రెండో రోజు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి.

హోరాహోరీగా ఖోఖో పోటీలు
ఖోఖో ఆడుతున్న టీం

నవోదయలో సౌత్‌ ఇండియా ఖోఖో రీజనల్‌ మీట్‌ పోటీలు 

పాల్గొన్న 66 జట్లు - 630 మంది క్రీడాకారులు 

రాజంపేట, సెప్టెంబరు 24: నవోదయ విద్యాలయంలో సౌత్‌ ఇండియా ఖోఖో రీజనల్‌ మీట్‌ రెండో రోజు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శుక్రవారం నుంచి సాగుతున్న ఈ పో టీలు ఆదివారంతో ముగియనున్నాయి. దక్షిణ భారతదేశం నుంచి ఆంరఽధ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, మహారాష్ట్ర, కరైకల్‌కు చెంది న 66 జిల్లాల జవహార్‌ నవోదయ విద్యాలయాల నుంచి 630 మంది క్రీడాకారులు పాల్గొన్నా రు. ఇందులో అండర్‌ 14, 17, 19 బాలబాలికల క్రీడా పోటీలు సాగుతున్నాయి. ఈపోటీల్లో శనివారం సాయంత్రం అందిన సమాచారం మేర కు అండర్‌ 14 బాయ్స్‌ క్రీడా పోటీల్లో ఈస్ట్‌గోదావరి జట్టుపై ప్రకాశం జట్టు విన్నర్‌గా నిలిచింది.

అండర్‌14 బాలికల విభాగంలో మహారాష్ట్ర జట్టుపై మహబూబ్‌ నగర్‌ జట్టు గెలిచింది. అం డర్‌ 17 బాలుర విభాగంలో మహబూబ్‌ నగర్‌ జట్టుపై రాయచూర్‌ జట్టు విజయం సాధించిం ది. అండర్‌ 17 బాలికల విభాగంలో మహబూ బ్‌ నగర్‌పై ఈస్ట్‌ గోదావరి జట్టు విన్నర్‌గా నిలిచింది. అండర్‌ 19 బాలుర విభాగంలో షిమోగా జట్టుపై రాయచూర్‌ జట్టు విన్నర్‌గా నిలిచింది. అండర్‌ 19 బాలికల విభాగంలో షిమోగ జట్టుపై అస్సాం జట్టు విన్నర్‌గా నిలిచింది.

Updated Date - 2022-09-25T05:12:28+05:30 IST