బంగారం లాంటి హోటల్‌!

ABN , First Publish Date - 2021-02-19T08:46:53+05:30 IST

ఆ హోటల్‌లో కాలుపెడితే స్వర్గలోకంలో అడుగుపెట్టిన భావన కలుగుతుంది. ఎందుకంటే ఆ హోటల్‌ మొత్తం బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. ఏ వస్తువు చూసినా బంగారు తాపడంతో

బంగారం లాంటి హోటల్‌!

ఆ హోటల్‌లో కాలుపెడితే స్వర్గలోకంలో అడుగుపెట్టిన భావన కలుగుతుంది. ఎందుకంటే ఆ హోటల్‌ మొత్తం బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. ఏ వస్తువు చూసినా బంగారు  తాపడంతో జిగేల్‌మంటూ మెరుస్తుంది. వియత్నాంలోని డోల్స్‌ హనోయి గోల్డెన్‌ లేక్‌ హోటల్‌ విశేషాలు ఇవి.


బంగారుతాపడం చేసిన మొట్టమొదటి హోటల్‌ ఇది. ఇందులో టాయిలెట్‌ సీట్‌ నుంచి టైల్స్‌ వరకు అన్నీ బంగారు తాపడం అద్దినవే కనిపిస్తాయి. 


ఈ హోటల్‌లో అతిథులకు 24 క్యారెట్‌ గోల్డ్‌తో చేసిన కప్పులో కాఫీ అందిస్తారు. బాత్‌ టబ్‌ సైతం బంగారు తాపడం చేసిందే. షవర్‌ హెడ్స్‌, సింక్‌లు, ట్యాప్స్‌.... ఇలా అన్నీ బంగారుపూతతో మెరిసిపోతూ ఉంటాయి. 


25 అంతస్తుల ఈ హోటల్‌ కోసం 200 మిలియన్‌ డాలర్లు వెచ్చించారు. అయితే ఇందులో బస చేయాలంటే లక్షల్లో బిల్లు చెల్లించాల్సి ఉంటుందనుకుంటే పొరపాటే. ఇందులో గది ప్రారంభ ధర సుమారు 20 వేల నుంచి ఉంది. 



Updated Date - 2021-02-19T08:46:53+05:30 IST