ఇంటర్వ్యూ కోసమని వచ్చిన మహిళతో.. పైగదికి వెళ్లు.. నేనొస్తా అని చెప్పాడు.. సరేనని వెళ్తే.. జరిగింది ఇది!

Dec 1 2021 @ 13:47PM

ఇంటర్‌నెట్‌డెస్క్: సార్.. మీ హోటల్‌లో ఏదైనా ఉద్యోగం ఇప్పించగలరా..? అని మహిళ అడిగింది. అవునా.. అయితే ఇంటర్వ్యూ కోసం పైన ఉన్న గదిలో వేచి ఉండు నేనొస్తా.. అని యజమాని చెప్పాడు. సరేనని వెళ్లిన ఆమెకు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..


జిల్లాలోని రామ్‌నగర్ పట్టణానికి చెందిన ఆనంద్ అనే 57ఏళ్ల వ్యక్తికి అజ్మీర్‌లోని దర్గా రోడ్డు దగ్గర రాయల్ హోటల్ ఉంది. అతడి హోటల్‌లో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ఇండోర్‌కు చెందిన ఓ మహిళ సోమవారం అతడిని సంప్రదించింది. ఆమె ఇటీవలే భర్త నుంచి విడాకులు తీసుకుని వేరుగా ఉంటోంది. బ్రతుకుదెరువు కోసం ఉద్యోగ వేటలో పడింది. ఈ నేపథ్యంలో రాయల్ హోటల్‌లో ఉద్యోగాలు ఉన్నాయని తెలిసి అక్కడికి వెళ్లింది. ‘సార్.. మీ హోటల్‌లో ఏదైనా ఉద్యోగం ఇప్పించగలరు’అని హోటల్ యజమాని ఆనంద్‌ను అడిగింది. అయితే ఇంటర్వ్యూలు పైన ఉన్న గదిలో జరుగుతున్నాయి.. అక్కడికి వెళ్లండి అని ఆనంద్ చెప్పాడు. అతడు చెప్పిన గదికి ఆమె వెళ్లింది. కాసేపటికి ఆనంద్ ఆ గదికి వచ్చాడు.


గదిలోకి రాగానే ఆనంద్ ఆమెతో మాటలు కలిపాడు. ఆమె పేరు, ఊరు అడగడం మొదలుపెట్టాడు. ఎలాంటి ఉద్యోగం కావాలంటూ ఆమె దగ్గరకు వెళ్లాడు. అతడు దగ్గరకు వస్తున్నా.. ఆమె ఆపాయాన్ని గుర్తించలేకపోయింది. ఆ మహిళ పట్ల ఆనంద్ అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమె పక్కకు జరుగుతున్నా వదలలేదు. బలవంతంగా ఆమెను లొంగదీసుకున్నాడు. అతడినుంచి ఆ మహిళ తప్పించుకుని బయటపడింది. నేరుగా దర్గా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పింది. 


పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడి కోసం రాయల్ హోటల్‌కు వెళ్లారు. అయితే ఆనంద్ అక్కడ లేడు. నిందితుడి కోసం గాలించగా మంగళవారం సాయంత్రం పట్టుబడ్డాడు. అతడిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దల్వీర్ సింగ్ ఫౌజ్‌దార్ అనే పోలీస్ అధికారి మాట్లాడుతూ ఉద్యోగం కోసం వచ్చిన మహిళపై రాయల్ హోటల్ యజమాని అత్యాచారం చేశాడని చెప్పారు. అతడిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.