కరోనా ఎఫెక్ట్... రోడ్లమీదే రెస్టారెంట్లు... న్యూయార్క్‌లో కొత్త ప్రయోగం

ABN , First Publish Date - 2020-09-26T21:03:59+05:30 IST

కరోనా వైరస్ మహమ్మరి నేపథ్యంలో న్యూయార్క్ లో అధికారులు ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అదేమిటంటే... ఔట్ డోర్ రెస్టారెంట్లు. వీటికి అనుమతినిస్తున్నట్టు అధికారికంగా ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో... ఇక రోడ్లమీదే హోటళ్లు నడు్స్తాయన్నమాట.

కరోనా ఎఫెక్ట్... రోడ్లమీదే రెస్టారెంట్లు... న్యూయార్క్‌లో కొత్త ప్రయోగం

న్యూయార్క్ : కరోనా వైరస్ మహమ్మరి నేపథ్యంలో న్యూయార్క్ లో అధికారులు ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అదేమిటంటే... ‘ఔట్ డోర్ రెస్టారెంట్లు’. వీటికి అనుమతినిస్తున్నట్టు అధికారికంగా ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో... ఇక రోడ్లమీదే హోటళ్లు నడు్స్తాయన్నమాట.


ఇదిలా ఉంటే... ‘రోడ్ల మీదే రెస్తారెంట్టు’ ప్రయోగం... వినియోగదారులకు ఓ కొత్త అనుభూతినివ్వడం మాట అటుంచితే... ఈ ప్రయోగం ద్వారా... సుమారు ఓ లక్షమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకకుండా చూడగలిగామని నగర మేయర్ బిల్ డీ బ్లాసియా పేర్కొన్నారు. ఈ సరికొత్త ప్రయోగాన్నిగత జూన్ లో ప్రారంభించినప్పటి నుంచి నగరవాసుల్లో పాపులర్ అయ్యిందని వెల్లడించారు.


ఇక... ‘ఓపెన్ రెస్టారెంట్’ అన్నది ఓ సాహసోపేత నిర్ణయమని, అయితే ఇది తాత్కాలికమేనని ఆయన చెప్పారు. ‘ఈ నిర్ణయం మంచి ఫలితాన్నిస్తోంది. చాలామంది... సరదాగా ఈ రోడ్ సైడ్ హోటళ్లలో కూర్చుని ఫుడ్ తినడానికి ఆసక్తి కనబరుస్తున్నారు’ అని బిల్ డీ పేర్కొన్నారు.


కాగా... రోడ్లపక్కనే ఫుట్‌పాత్ ల పై చిన్న చిన్న మోటెళ్ళువంటివి సాధారణమే అయినప్పటికీ... నేరుగా అధికారికంగా ఇలా రోడ్లపైనే హోటళ్ళను నడపడం, వాటిని వినియోగదారులు ఎంజాయ్ చేస్తుండడం మాత్రం ఓ కొత్త అనుభూతినిస్తోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.


ఇదిలా ఉంటే... ప్రస్తుత కరోనా నేపధ్యంలో... మరికొన్ని ఇతర నగరాల్లో కూడా ఈ తరహా హోటళ్ళు ఏర్పాటయ్యే సూచనలున్నాయని చెబుతున్నారు. 

Updated Date - 2020-09-26T21:03:59+05:30 IST