బైక్ ఆపమంటే ఆపలేదని పోలీసుల ఛేజింగ్.. స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ.. ఇంటికి వచ్చిన కాసేపటికే..

ABN , First Publish Date - 2021-12-06T22:20:48+05:30 IST

అతని పేరు మణికందన్.. తన స్నేహితులతో కలిసి బైక్ రైడింగ్‌కు వెళ్లాడు..

బైక్ ఆపమంటే ఆపలేదని పోలీసుల ఛేజింగ్.. స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ.. ఇంటికి వచ్చిన కాసేపటికే..

అతని పేరు మణికందన్.. తన స్నేహితులతో కలిసి బైక్ రైడింగ్‌కు వెళ్లాడు.. ఒక జంక్షన్‌లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు.. అక్కడ తన బైక్‌ను ఆపకుండా మణికందన్ ముందుకు పోనిచ్చాడు.. దీంతో పోలీసులు అతడిని వెంబడించారు.. పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు.. అనంతరం అతని కుటుంబ సభ్యులను పిలిచి ఇంటికి పంపించారు.. స్టేషన్ నుంచి వెళ్లిన కొద్ది సేపటికే మణికందన్ మరణించాడు.. పోలీసులు కొట్టడం వల్లే మణికందన్ మరణించాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 


తమిళనాడులోని రామాంతపురంలో నివసిస్తున్న మణికందన్ శనివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి సరదాగా బైక్‌పై షికారుకు వెళ్లాడు. కీలాతువాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు నిర్వర్తిస్తున్నారు. మణికందన్ అక్కడ తన వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు అతడిని వెంబడించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ అతడిని ప్రశ్నించారు. అనంతరం మణికందన్ తల్లి, సోదరుడిని స్టేషన్‌కు పిలిపించి అతడిని అప్పగించారు. 


ఇంటికి వెళ్లిన మణికందన్ ఆదివారం తెల్లవారుఝామున నురగలు కక్కుకుంటూ చనిపోయాడు. పోలీసుల టార్చర్ వల్లే మణికందన్ చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసుల నచ్చ చెప్పడంతో శాంతించారు. మణికందన్ మృతదేహానికి వైద్యులు పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.  

Updated Date - 2021-12-06T22:20:48+05:30 IST