
ముంబై : మహారాష్ట్రలోని ముంబై నగరంలో మంగళవారం ఉదయం ఓ ఇల్లు కుప్పకూలిన దుర్ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.జై మహారాష్ట్ర నగర్లోని కొండ ప్రాంతంలోని ఒక అంతస్తు ఉన్న ఇల్లు మంగళవారం ఉదయం 8.10 గంటలకు కూలిపోయింది. నాలుగు అగ్నిమాపకశాఖ వాహనాలు, పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. ఇంటి శిథిలాల కింద కూరుకుపోయిన ఏడుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించామని అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పారు. క్షతగాత్రులు సియాన్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు.ఇల్లు కూలిన ప్రాంతంలో శిథిలాలను సహాయ సిబ్బంది తొలగిస్తున్నారు.