షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

ABN , First Publish Date - 2022-07-06T05:36:17+05:30 IST

మండలంలోని మల్లాయిపల్లి గ్రామంలో లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంటికి షార్ట్‌సర్క్యూట్‌తో నిప్పంటుకుని దగ్ధమైనట్లు గ్రామస్థులు తెలిపారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

ఎల్లారెడ్డి, జూలై 5: మండలంలోని మల్లాయిపల్లి గ్రామంలో లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంటికి షార్ట్‌సర్క్యూట్‌తో నిప్పంటుకుని దగ్ధమైనట్లు గ్రామస్థులు తెలిపారు. వ్యవసాయ పనులకు మంగళవారం కుటుంబసభ్యులంతా పొలానికి వెళ్లారు. ఇంట్లోంచి పొగలు రావడాన్ని గమనించిన గ్రామస్థులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. దాదాపు రూ.50 వేల ఆస్తినష్టం అయినట్లు కుటుంబీకులు తెలిపారు.


Updated Date - 2022-07-06T05:36:17+05:30 IST