ఇళ్ల పట్టాలకు లే అవుట్‌లను సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2020-12-03T05:27:48+05:30 IST

పేదల ఇళ్ల పట్టాల లే-అవుట్‌లను ఈనెల 25 నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని అమలాపురం సబ్‌ కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ ఆదేశించారు. మండలంలోని పల్లిపాలెంలో 208 మందికి సంబంధించి సేకరించిన 3.97 ఎకరాల లే అవుట్‌ను బుధవారం ఆయన పరిశీలించారు.

ఇళ్ల పట్టాలకు లే అవుట్‌లను సిద్ధం చేయాలి
ముమ్మిడివరంలో ఇళ్ల స్థలాల లే అవుట్‌ను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్‌

  • అమలాపురం సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్‌

ముమ్మిడివరం, డిసెంబరు 2: పేదల ఇళ్ల పట్టాల లే-అవుట్‌లను ఈనెల 25 నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని అమలాపురం సబ్‌ కలెక్టర్‌  హిమాన్షుకౌశిక్‌ ఆదేశించారు. మండలంలోని పల్లిపాలెంలో 208 మందికి సంబంధించి సేకరించిన 3.97 ఎకరాల లే అవుట్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. ఆ లే అవుట్‌లో రోడ్డు నిర్మాణం పూర్తయినా, చెట్లుచెదారం ఉన్నట్టు గుర్తించి వాటిని వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశించారు. మట్టాడిపాలెంలో 600 మంది లబ్ధిదారులకు సంబంధించిన పదెకరాల లే-అవుట్‌ను పరిశీలించారు. అయితే భూమి లెవెలింగ్‌ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు సంబంధించి సీడ్‌ స్టోరేజీ గొడౌన్‌కు 50 సెంట్లు భూమి అవసరం కావడంతో ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి చెందిన ఆరెకరాల భూమిని పరిశీలించి అందులో 50సెంట్లకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని డిప్యూటీ తహశీల్దార్‌ యడ్ల రాంబాబును ఆదేశించారు. పర్యటనలో నగర పంచాయతీ కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌, ఎంపీడీవో అవసరాల శ్రీనివాస్‌, హౌసింగ్‌ ఏఈ జీఎస్‌ఎన్‌ దాసు, టీపీఎస్‌ రాణిసంయుక్త, వీఆర్వో అనుపిండి సూరిబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T05:27:48+05:30 IST