ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వడ్డిలంక గ్రామస్థుల ధర్నా

ABN , First Publish Date - 2021-06-22T04:57:13+05:30 IST

తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ వడ్డిలంక గ్రామస్థులు, మహిళలు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం నిరసన చేపట్టారు.

ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వడ్డిలంక గ్రామస్థుల ధర్నా
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వడ్డిలంక గ్రామస్థులు

యలమంచిలి, జూన్‌ 21 : తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ వడ్డిలంక గ్రామస్థులు, మహిళలు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం నిరసన చేపట్టారు. వడ్డిలంక గ్రామంలో చిల్లేవారిపేట నుంచి వైర్‌ వరకు ఉన్న డ్రెయిన్‌ పోరంబోకు ప్రభుత్వ భూమిని ఆనుకుని కొన్నేళ్లుగా సుమారు 30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. డ్రెయిన్‌ తవ్వినా, రోడ్డు వెడల్పు చేసినా 30 కుటుంబాలు నివాసాలు కోల్పోయే ప్రమాదం ఉంది.ఈ నేపథ్యంలో ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం   వినతిపత్రాన్ని డీటీ అహ్మద్‌ ఫరూఖ్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో  కడలి గోపాలరావు, సర్పంచ్‌ చిట్టిబాబు, బళ్ల నాగదుర్గాభవాని, కప్పిరి జ్యోతి, గుబ్బల లక్ష్మీకాంతం, తోట గరగాలు, శీలం సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:57:13+05:30 IST