ఎర్రగొండపాలెం, జనవరి 23 : ఎర్రగొండపాలెంలోని గాయత్రి సినిమాహాల్ పరిసరాల్లో గుడిసెలు ఏర్పాటు చేసుకొని ప్రవేటు స్థలాలలో నివాసం ఉంటున్నామని, రాజన్న కాలనీల్లో ఇళ్ల పట్టాలు ఇప్పించాలని 20 మంది ఎస్టీ మహిళలు శనివారం ఇన్చార్జ్ తహసీల్దారు వి.వీరయ్యను కలసి విజ్ఞప్తి చేశారు. గతంలో అర్జీలు అందజేశామని తెలిపారు. అర్జీలు పరిశీలించి అర్హూలైన వారికి పట్టాలు మంజూరు చేస్తానన్నారు.